భారత విద్యార్థికి బ్రాడ్‌మన్ స్కాలర్ షిప్
మెల్బోర్న్: భారత సంతతికి చెందిన అమిత్ బాల్గి(23) అనే విద్యార్థి ప్రతిష్టాత్మక క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ స్కాలర్ షిప్ గెలుచుకున్నాడు. బ్రాడ్‌మన్ గురించిన నాయకత్వ లక్షణాలు, అతను అనుసరించిన విలువలు ప్రదర్శించిన కారణంగా అమిత్ బాల్గికి ఈ స్కాలర్ షిప్ అందజేశారు.
న్యూ సౌత్ వేల్స్‌లోని చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ(సిఎస్‌యు)లో డెంటల్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న అమిత్ బాల్గి, 60 మంది పోటీదారులను అధిగమించి ఈ స్కాలర్ షిప్‌ను అందుకున్నాడు. క్రీడా సామర్థ్యం, విద్యా నైపుణ్యం, కమ్యూనిటీ ప్రమేయం అంశాల్లో సమతౌల్యం ప్రదర్శించిన వారికి బ్రాడ్‌మన్ స్కాలర్ షిప్ ఇస్తారు. స్కాలర్ షిప్‌లో భాగంగా ఏడాదికి 4,670 డాలర్ల చొప్పున మూడు సంవత్సరాలపాటు అందజేస్తారు.

ఈ సందదర్భంగా బాల్గి మాట్లాడుతూ... తనకు క్రికెట్ అంటే ఇష్టమని చెప్పాడు. సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను తాను అమితంగా ఆరాధిస్తానని చెప్పాడు. తనకు ఆయన స్కాలర్ షిప్ రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. చదువుతోపాటు క్రికెట్ ఆడేందుకు కూడా హోవర్డ్ తనను ప్రోత్సహించిందని అమిత్ బాల్గి చెప్పాడు.
బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఛైర్మన్ మౌరీస్ న్యూమన్ నేతృత్వంలోని మాజీ ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్, ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రినా హోర్, 2008 బ్రాడ్‌మన్ స్కాలర్ డేవిడ్ మిల్లర్ సభ్యుల కమిటీ బాల్గీని ఎంపిక చేసింది. బాల్గి పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంతోపాటు ప్రజల్లో సమస్యలపై అవగాహన కల్పించారని నిర్వాహకులు చెప్పారు. ఆస్ట్రేలియా, ఇండియాల్లో పర్యటించి సలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. బ్రాడ్‌మన్ నుంచి నాయకత్వ లక్షణాలు, డిగ్నిటి, సంకల్పం, వినయం లాంటి అంశాలను నేర్చుకున్నారని హోర్ పేర్కొన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications