కొడుకు హత్య, పొదల్లో పడేసింది: కోర్టులో ప్రత్యక్షం
లండన్: తన మూడేళ్ల కుమారుడిని హత్య చేసి పరారీలో ఉన్న ఓ భారత సంతతికి చెందిన మహిళ హఠాత్తుగా కోర్టులో ప్రత్యక్షమైంది. మంగళవారం ఆమె స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ కోర్టులో హాజరైంది. వివరాల్లోకి వెళితే.. రస్దీప్ కులార్(34) గత జనవరి 12నుంచి మూడు రోజులపాటు తన కుమారుడు మైకీల్ కులార్‌ను తీవ్రంగా కొట్టి హత్య చేసింది.
ఆ తర్వాత అతని మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు తన కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 16న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, కులార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తీవ్ర గాయాలతో చెట్ల పొదల్లో పడివున్న మైకీల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా ఆ లోపే నిందితురాలైన రస్దీప్ పరారైంది. కాగా, గత మంగళవారం హఠాత్తుగా ఆమె కోర్టు ఎదుట ప్రత్యక్షమైంది. తన అసలు పేరు అడికోయా అని కోర్టుకు తెలిపింది. తనకు నలుగురు పిల్లలని, ఇద్దరు కవల పిల్లల్లో మైకీల్ ఒకడని చెప్పింది.
నిందితురాలితోపాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చారు. కుమారుడి హత్య చేసిన ఆమెకు ఎలాంటి పశ్చాతాప భావన లేదని అక్కడి మీడియా తన కథనంలో పేర్కొంది. జులై 25న తమ ముందు హాజరుకావాలని నిందితురాలు రస్దీప్ కులార్‌ను కోర్టు ఆదేశించింది. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని కోర్టు నిందితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై హత్యా నేరాభియోగాలు నమోదయ్యాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications