వ్యభిచార గృహాలతో లింక్స్.. భారత సంతతి సీఈఓ అరెస్ట్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సీఈఓను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి వ్యభిచార గృహాలతో సంబంధాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ సీఈఓగా పనిచేస్తోన్న అనురాగ్ బాజ్‌పాయి (Anurag Bajpayee)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వార్తను న్యూయార్క్ పోస్ట్ ప్రచురితం చేసింది.
వ్యభిచార గృహాల్లో గడిపిన, ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లైంట్ల జాబితాలో అనురాగ్ బాజ్‌పాయి పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక క్లైంట్ల గ్రూప్‌లో అనురాగ్ పేరు ఉందని విచారణ అధికారులు వెల్లడించారు. వీరంతా గంటకు 600 డాలర్లు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

మానవ అక్రమ రవాణా కారణంగానే ఆ వ్యభిచార కూపంలో మహిళలు చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తమ సీఈఓ పేరు ఉండటంతో గ్రేడియంట్ సంస్థ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం అనురాగ్‌కు మద్దతు ప్రకటించింది. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.
అనురాగ్ ప్రస్థానం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పాఠశాల విద్యను అభ్యసించిన అనురాగ్.. 2006లో యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరి-కొలంబియా నుంచి మెకానిక్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్, ఆ తర్వాత పీహెచ్‌డీ చేశారు. ఉప్పు నీటిని తాగునీటిగా మార్చడం, మురుగునీటిని శుద్ధి చేయడంపై ఆయన పీహెచ్‌డీ చేయడం గమనార్హం.
ఇక, 2013లో గ్రేడియంట్ కంపెనీని స్థాపించి.. ఒక బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ముగురునీటిని శుద్ధి చేస్తుంది. 25 దేశాల్లో ఫార్మా, సెమీ కండక్టర్, మైనింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలకు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన క్లీన్ టెక్ రంగంలో అనురాగ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి ఎంతో మంచి కార్యక్రమాలతో ఎదిగిన అనురాగ్.. ఇప్పుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications