స్విమ్మింగ్ ఫూల్‌లో పడిన బాలిక సురక్షితం

ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని విన్స్‌స్టన్ హిల్స్‌లో జరిగింది. బంధువులను కలిసేందుకు తన ముగ్గురు కూతుళ్లతో కలిసి బాధితురాలి తల్లి స్విమ్మింగ్ ఫూల్ వద్దకు వచ్చింది. ఈత రాని బాధిత బాలిక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు గమనించి ఆమెను కాపాడారు.
తమ కూతురు ఎక్కువ నీళ్లు మింగకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని బాలిక తండ్రి సుర్నమ్ సింగ్ మీడియాకు తెలిపారు. గతంలో కూడా తన కూతురుకు మూడేళ్ల వయస్సులో ఉన్న సమయంలో ఇదే కొలనులో పడిపోయిందని చెప్పారు.
అప్పుడు 15 నిమిషాల తర్వాత ఆమెను స్విమ్మింగ్ ఫూల్‌లో గుర్తించి కాపాడామని తెలిపారు. అయితే అప్పుడు తన మెదడుకు తీవ్రమైన గాయమైందని ఆయన చెప్పారు. ఆ సమయంలో తన కూతురు సుమారు ఆరువారాలపాటు ఆస్పత్రిలోనే వైద్య చికిత్స తీసుకుందని తెలిపారు. అలాంటి ప్రమాదమే మళ్లీ సంభవించడంతో తాము తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications