క్లాస్‌రూంలో బిడ్డను కన్న టీచర్

Indian-origin teacher in UK gives birth in classroom
లండన్: ఓ భారత సంతతికి చెందిన ఉపాధ్యాయురాలు ఇంగ్లాండులోని పాఠశాల తరగతి గదిలో పురుడు పోసుకుంది. వైద్యులు నిర్ధారించిన తేదీ కన్నా వారం రోజుల ముందే డైనే క్రిష్ వీరమణి అనే 30 ఏళ్ల మహిళకు పాఠశాలలో నొప్పులు వచ్చాయి. దీంతో పాఠశాల సహోద్యోగులు ముగ్గురు సహకరించి ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి బిడ్డను కన్నది.

గత గురువారంనాడు ఆమెకు బిడ్డు పుట్టింది. ప్రతి ఒక్కరూ చాలా సహకరించారని ఆమె మురిసిపోయింది. అదృష్టవశాత్తు బిడ్డ పుట్టడానికి ముందే తన భర్త పాఠశాలకు చేరుకున్నట్లు ఆమె తెలిపింది. పాఠశాలలో ఆమె ఉదయం సమావేశానికి హాజరైంది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లాలని అనుకుంది.

వచ్చి తనను తీసుకుని వెళ్లాలని తన భర్తకు సందేశం పంపించానని, అంబులెన్స్ తెప్పించాలా అని తన సహోద్యోగులు తనను అడిగారని ఆమె చెప్పిది. భార్యను తీసుకుని వెళ్లడానికి విజయే వీరమణి వస్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభమైనట్లు సమాచారం అందింది.

టీచింగ్ ఆసిస్టెంట్స్ దీతా గోజనోవిసి, క్రిష్ స్వార్డ్, సామ్ ముస్తపా తరగతి గదిలో ఆమె సుఖప్రసవానికి సహకరించారు. ఒకరు తన భర్తతో మాట్లాడుతున్నారని, మరొకరు ఆస్పత్రికి ఫోన్ చేస్తున్నారని, మరొకరు అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఇంతలో తనకు బిడ్డ జోనా పుట్టాడని ఆమె చెప్పింది. ఆమె ప్రసవానికి వాడిన తరగతి గదిని జోనా రూమ్ అని పిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+