బ్రిటిష్ కపుల్ కిడ్నాప్: సౌతాఫ్రికాలో భారత సంతతి మహిళ అరెస్టు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా స్పెషల్ పోలీస్ యూనిట్ హాక్స్.. భారతీయురాలిని, అతని పార్ట్‌నర్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరికి ఐఎస్ఐఎస్‌తో లింక్స్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
అంతేకాదు, వారు ఓ బ్రిటిష్ జంటను కిడ్నాప్ చేసిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఫాతిమా, అస్లామ్ అనే ఆ ఇద్దరి పైన దొంగతనం రాబరీ తదితర కేసులు కూడా నమోదు చేశారు.

వీరు ఆ బ్రిటిష్ కపుల్ క్రెడిట్ కార్డులు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను ఖర్చు కోసం ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ జంట సమాచారం ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో అరెస్టైన వారి గురించి పూర్తి సమాచారం పోలీసులు చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications