బర్త్‌డే పార్టీ: ఈతకొలనులో ఎన్నారై మహిళ మృతి

అమెరికాలోని లాంగ్ ఐలాండ్‌లోని ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను ఆదివారం ఉదయం శుభ్రం చేస్తుడంగా మృతదేహం బయపడింది. అంతకు ముందు రాత్రి ఆ ఇంట్లో పుట్టినరోజు పార్టీ జరిగినట్లు సల్ఫోక్క్ పోలీసులు తెలిపారు.
బర్త్‌డే పార్టీకి ఆమె అతిథిగా వచ్చినట్లు గుర్తించారు. రాజకుమారి మృతదేహాన్ని సల్ఫోక్ కౌంటీ వైద్యాధికారి కార్యాలయానికి తరలించారు. అయితే రాజకుమారి మృతి వెనక కుట్ర కోణం ఏదీ లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఆమెకు సంబంధించిన వివరాలు తెలిస్తే చెప్పాలని పోలీసులు స్థానికులను కోరారు. ఇద్దరు యువకులు ఆ ఇంట్లో నివసించేవారని, వారికి ఆ ఇల్లు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని, రెండేళ్ల క్రితం వారు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారని పొరుగు మహిళ ఒక్కరు చెప్పారు .












Click it and Unblock the Notifications