వేధింపులు: ప్రీస్ట్‌కి 36ఏళ్ల జైలు, బహిష్కరణ!

ఈ కేసులో నిందితుడైన ఫాదర్ లియో చార్లెస్ కొప్పాల మార్చి 17న తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతన్ని తిరిగి భారతదేశానికి పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొప్పాల (47) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు బిషప్ పర్యవేక్షణ పరిధిలోని అనాథలకు సహాయం అందిస్తున్నారని ఫెయిర్ మోంట్‌సెంటినల్ తన కథనంలో పేర్కొంది.
కొప్పాలను బాధితురాలి అమ్మమ్మ తన ఇంటికి రాత్రి భోజనానికి ఆహ్వానించింది. ఆమె ఆహ్వానం మేరకు కొప్పాల ఆమె ఇంటికి వెళ్లాడు. టివి చూస్తున్న 12ఏళ్ల బాధిత బాలిక చెంపపై, పెదవులపై ముద్దు పెట్టాడు. అంతేగాక ఆమె శరీర భాగాలను తాకూతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కాగా, బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన అమ్మమ్మతో తెలపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు లైంగిక పరమైన నేరాభియోగాలను కొప్పాలపై నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి 36ఏళ్లపాటు జైలు శిక్ష విధించడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అమెరికా నుంచి భారతదేశానికి పంపించే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఫెయిర్ మోంట్‌సెంటినల్ కథనం పేర్కొంది.












Click it and Unblock the Notifications