ఒమన్‌లో భారత ఫ్రొఫెసర్ మృతి

ప్రొఫెసర్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. హిషం అబ్దుల్ ఖాదర్ ఒంటరిగానే నివాసం ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి తాము 10.30 గంటల ప్రాంతంలో అతని గదికి వెళ్లినట్లు హిషం సన్నిహితులు తెలిపారు. ఆ సమయంలో తన గదిలోనే హిషం అబ్దుల్ ఖాదర్ మృతి చెంది ఉన్నాడని వారు చెప్పారు.
అతని టేబుల్‌పై భోజనం కూడా వడ్డించి ఉందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో హిషం సాయంత్రం నడక కోసం బయటికి వచ్చారని పలువురు తెలిపారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హిషం భారతదేశంలోని అతని భార్యకు ఫోన్ చేసినట్లు చెప్పారు.
హిషం అబ్దుల్ ఖాదర్‌కు హృదయ సంబంధమైన వ్యాధి ఉన్నట్లు అతని స్నేహితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య.. భారతదేశంలోని కేరళ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు మృతుని నివాసానికి సీల్ వేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications