కెనడాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
కెనడా: భారత విద్యార్థి(27) సాయిచంద్ పాతపాటి జూన్ 18న కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భారతదేశంలోనే బిఈ పూర్తి చేసిన సాయిచంద్ కెనడాలోని టొరంటోలోని లాంబ్టన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. సాయిచంద్ 2012, ఆగస్టు 31న కెనడాకు వచ్చాడు. అక్టోబర్ 10, 2013లో అతని భార్య ఇక్కడకు వచ్చింది. గ్రాడ్యూయేట్ పూర్తి చేస్తున్న అతను గత శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాయిచంద్‌కు తమకు తెలిసి ఎలాంటి సమస్యలు లేవని, అతను తన గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాలనే తపనతో ఉండేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, అన్నయ్య చంద్రమోహన్, తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, మహాలక్ష్మి ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని మల్లవరప్పాడు గ్రామానికి చెందిన సాయిచంద్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. అతని కుటుంబ సభ్యులు ఎంతో కష్టనష్టాలకోర్చి కెనడాలో చదివించేందుకు పంపించారు. ఖర్చుల కోసం వారే డబ్బులు పంపించేవారు. వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో చివరకు తానా సహాయం కోరారు.

తెలుగు ప్రాంత ప్రతినిధులు అనీల్ లింగమనేని, స్థానిక టీమ్ స్వ్కేర్ వాలంటీర్లు మీన ముల్పూరి, గంగాధర్ సుఖావాసి, బాషా షేక్, అబ్దుల్ మునాఫ్, చారి సామంతపూడి, అను నిమ్మగడ్డ, అంజనేయులు నల్లమోతు.. సాయిచంద్ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సాయిచంద్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లను తానా చేస్తోంది. సాయిచంద్ కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు తానాకు మరికొందరు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేయాలని కోరింది. దాతలు http://www.tana.org/donate సంప్రదించవచ్చని తెలిపింది. చెక్ పంపించాలని భావిస్తున్నవారు, పేయబుల్ టు ‘తానా', మెయిల్ చేయాలనుకునే వారు: మధు టాటా, తానా ట్రెజరర్, 2655 కోబ్ పార్క్‌వే సే, అట్లాంటా జిఏ 30339. ఏమైన అదనపు నిధులు వస్తే టీమ్ స్క్వేర్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించపడుతుందని టానా పేర్కొంది. దాతలు ఇచ్చే మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపింది.












Click it and Unblock the Notifications