బెదిరింపు: అమెరికా నుంచి భారత విద్యార్థి బహిష్కరణ
హూస్టన్: ఉన్నత విద్యకోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యాడు. సామాజిక నెట్‌వర్క్ వెబ్‌సైట్లు యూట్యూబ్, గూగుల్ ఫ్లస్‌లలో మహిళలను హత్యచేస్తానని బెదిరింపులతో కూడిన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
సియాటెల్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం విద్యార్థి కేశవ్ ముకుంద్ భిడే(24) మహిళలను హత్యచేస్తానని ఆన్‌లైన్‌లో బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. నిరుడు మేలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి సమీపంలోని శాంతా బార్బరా వద్ద ఆరుగురు విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. తనకు తాను కాల్చుకుని చనిపోయిన రోడ్గేర్ చేసిందంతా న్యాయబద్ధమేనని తన యూట్యూబ్ ఖాతాలో ముకుంద్ భిడే పేర్కొన్నాడని పోలీసులు తేల్చారు.

ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఇతరులతో చాటింగ్ నిర్వహించిన భిడే.. తన పేరు చెప్పాలని వారు అడిగినప్పుడు ‘నేను సియాటెల్‌లో నివసిస్తున్నా.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి వెళ్లా, నేను మీకిచ్చే సమాచారం ఇదే. నేను మహిళలను మాత్రమే హత్యచేస్తా. ఇలియట్ చేసిందానికంటే మరింత చేస్తా' అని భిడే వ్యాఖ్యానించాడు.
ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తునకు వెళ్లిన ఎఫ్‌బీఐ అధికారులతోనూ అతడు దురుసుగా ప్రవర్తించాడు. భిడేను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు డిసెంబర్ నెలలోనే భారత్‌కు పంపివేశారు. అతడి విద్యార్థి, సందర్శక వీసాను రద్దుచేస్తూ అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ జారీచేసిన ఆదేశాలను వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ధృవీకరించింది. పదేళ్లలో తమదేశంలో అడుగుపెడితే భిడేపై అభియోగాలు నమోదుచేస్తామని హెచ్చరించారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications