అమెరికా-ఢిల్లీ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన భారతీయ విద్యార్థి, తర్వాత..
న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్ర విసర్జన వివాదం ఇంకా మరువకముందే అదే తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారతీయ విద్యార్థి తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఏఏ292 నెంబర్‌తో ఉన్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ విమానం శుక్రవారం న్యూయార్క్ నుంచి రాత్రి 9.16 గంటలకు బయల్దేరింది. దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

కాగా, మూత్ర విసర్జన చేసిన నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మూత్రం పోసిన సమయంలో నిందిత విద్యార్థి తాగిన మైకంలో నిద్రిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు. ఆ మూత్రం పక్కనే ఉన్న తనపై పడినట్లు తోటి ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందికి తెలియజేశాడు. అయితే, బాధితుడు మాత్రం దీన్ని పోలీసుల వరకు తీసుకెళ్లాలని భావించలేదని సమాచారం.
నిందితుడు తన చర్యకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఇది వివాదంగా మారితే తన కెరీర్‌కే ముప్పు వస్తుందని ప్రాధేయపడినట్లు తెలిసింది. అయితే, విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని వెంటనే పైలట్ ద్వారా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) దృష్టికి తీసుకెళ్లారు. ఏటీసీ అధికారులు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో విమానం ల్యాండ్ కాగానే నిందితుడ్ని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.ఘటనపై దర్యాప్తు చేసి అతనిపై చర్యలు తీసుకోనున్నారు.
ఇది ఇలావుంటే, మూత్ర విసర్జన చేసిన భారత విద్యార్థిని భవిష్యత్‌లో తమ విమానాల్లో అనుమతించబోమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. మూత్ర విసర్జన చేయడంతోపాటు అతడు విమాన సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించాడని పేర్కొంది.












Click it and Unblock the Notifications