లైంగిక వేధింపులు: టెక్కీకి జైలు శిక్ష

Indian techie sentenced to nine months in prison for sexual assault in US
వాషింగ్టన్: విమానంలో ప్రయాణిస్తున్న సహచర మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ భారతీయునికి 9నెలల జైలు శిక్ష విధించింది అమెరికాలోని జిల్లా కోర్టు. శిక్ష అనుభవించిన తర్వాత అతన్ని అమెరికా నుంచి భారత దేశానికి పంపిస్తారు.

సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస ఎస్ ఎర్రమిల్లి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 5వేల డాలర్ల జరిమానాతోపాటు కస్టడీ అనంతరం ఏడాదిపాటు కోర్టు పర్యవేక్షణలో ఉండాలని అమెరికాలోని జిల్లా జడ్జి జోన్ హెచ్ లెఫ్కో ఆదేశించారు.

వచ్చే బుధవారం జడ్జీ మళ్లీ అతని వాదనలు విననున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎర్రమిల్లి శ్రీనివాస్‌తో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని కోరనుంది. కాగా శ్రీనివాస దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని అంటూ అతన్ని విమాన ప్రయాణాలు నుంచి రద్దు చేసినట్లు న్యాయశాఖ తెలిపింది. కస్టడీ అనంతరం భారత దేశానికి పంపించనున్నట్లు పేర్కొంది.

న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి లెఫ్కో శిక్షను ఖరారు చేశారు. నిందితుడు ఎర్రమిల్లి శ్రీనివాస్, ఇతరులకు ఈ కేసులో కస్టడీ విధించారు. నిందితుల నుంచి లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా నిందితుడు శ్రీనివాస్ ఇప్పటికే ఇలాంటి రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.

విచారణలో రుజువైన వివరాల ప్రకారం.. జూన్ 14, 2011లో చికాగో మిడ్వే ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్‌లో మూడు సీట్ల పరిమితి కలిగిన సీట్‌లో బాధితురాలు, ఆమె భర్త కూర్చుని ఉండగా నిందితుడైన శ్రీనివాస్ వారి ఇద్దరి మధ్య సీటు ఖాళీగా ఉండడంతో కూర్చున్నాడు. ఆ సమయంలోనే బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా బాధితురాలి 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకునేందుకు లాస్‌వెగాస్‌కు వెళుతున్న సందర్భంలో ఈ ఘటన చేసుకుంది. షార్ట్స్ ధరించి ప్రయాణిస్తున్న 65ఏళ్ల బాధితురాలిపై శ్రీనివాస లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+