భవనంపై నుంచి పడి తల్లీబిడ్డ మృతి

ఆ సంఘటన మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. బాల్కనీలోంచి తల్లీబిడ్డలు కిందపడినప్పుడు ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నట్లు సమాచారం.
అయితే, సంఘటన వేరే విధంగా జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. అయితే, దర్యాప్తు మాత్రం జరుగుతుందని అన్నారు. ఆ కుటుంబం ఏడాది పాటుగా ఆ భవనంలో ఉంటోంది. మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పడానికి ఆధారాలు లేవని, ఏ విధమైన సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు.
అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు తల్లీబిడ్డల మృతిపై వివరాలను చెప్పలేమని అన్నారు. బిడ్డతో కలిసి మహిళ ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు కిందపడిందా అనేది తేలాల్సి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications