ఐదుగురు భారతీయుల సజీవ సమాధి

'Indians' tortured, buried alive in Saudi Arabia
రియాద్/న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో 2010లో జరిగిన ఐదుగురి దారుణ హత్య కేసులో నిందితులు తమ నేరాన్ని కోర్టు ఎదుట అంగీకరించారు. ఆసియాకు చెందిన ఐదుగురు కూలీలను చిత్ర హింసలకు గురి చేసి, ఆ తర్వాత వారిని సజీవంగా సమాధి చేసినట్లు నిందితులు కోర్టు తెలిపారు. కాగా బాధితులు భారతదేశానికి చెందిన కూలీలుగా భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

అరబ్ న్యూస్ కథనం ప్రకారం.. బుధవారం ఖతీఫ్ కోర్టు ఎదుట ముగ్గురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఐదుగురు కూలీలను చిత్ర హింసలకు గురి చేసి, వారిని సజీవ సమాధి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు అరబ్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్‌లోని సాఫ్వాలోని ఓ పొలంలో పాతిపెట్టిన ఐదుగురు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. బాధితుల హత్యకు సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు మొదట 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో తాను డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుండగా స్నేహితుడు ఫోన్ చేసి తొందరగా ఆ పొలం వద్దకు రమ్మన్నాడని నిందితులలో ఒకడు చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్నట్లు అతడు తెలిపాడు. అక్కడ ఐదుగురు వ్యక్తులు తాళ్లతో కట్టి పడేసి ఉన్నారని చెప్పాడు. వారిని ఎందుకు కట్టేశావని తాను అడిగానని.. అందుకు సమాధానంగా అతడు, బాధితుల్లో ఒకరు వారి స్పాన్సర్ కూతురును, మరో మహిళను లైంగికంగా వేధించారని తెలిపాడు.

తాను ఘటనా స్థలానికి చేరుకునేప్పటికే ఆ ఐదుగురు భారతీయులు అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిపాడు. మళ్లీ మద్యం సేవించడానికి తన స్నేహితుని గదికి వెళ్లినట్లు తెలిపాడు. బాధితుల్లో ఒకరు అరవడంతో అక్కడి వెళ్లి అతనిపై దాడి చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఐదుగురు బాధితులను ఓ ట్రక్‌లో తీసుకెళ్లి 2.5 మీటర్ల లోతుగా తీసిన గోతిలో సజీవంగా పడేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత వారిని మట్టితో కప్పేసినట్లు తెలిపాడు. నిందితుల సమాచారం మేరకు తవ్వకాలు జరిపిన పోలీసులు, కుళ్లిపోయిన బాధితుల మృతదేహాలను వెలికి తీశారు. వారు ధరించిన బంగారు ఆభరణాలు, రెసిడెంట్ కార్డ్స్‌ల ఆధారంగా బాధితులను పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+