బహ్రెయిన్‌లో నేలరాలిన తెలంగాణ బిడ్డ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..
కామారెడ్డికి చెందిన మార్కంటి బాబు బహ్రెయిన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.టీఆర్ఎస్ ఎన్నారై సభ్యుల చొరవతో అతని పార్థివ దేహాన్ని ఇండియా తరలించారు.ఇందుకోసం టీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు అన్ని
బహ్రెయిన్: తెలంగాణ యువకుడు కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు వయస్సు 34 పాస్ పోర్ట్ నెంబర్ M9743802, బహరేన్ లో ఒక్క ప్రైవేట్ కంపెనీ లో గత 10 సంవత్సరాల నుండి లేబర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తేదీ 8 ఆగస్ట్ 2017న ఉదయం 06:00 గంటలకు డ్యూటీ టైంలో రోడ్ క్రాస్ చేస్తుండగా అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు. వారి అకాల మరణం చాల బాధాకరం, మృతిచెందిన బాబుకు, భార్యతో పాటు ఒక కూతురు, ఒక కుమారుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

మార్కంటి బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే విషయాన్ని అతని తోటి కంపెనీ లో పని చేస్తున్న స్నేహితులు సాయన్న, ఆంజనేయులు, ఈ విషయం ఎన్నారై టీఆరెస్ సెల్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి వెంటనే స్పందించారు.
బాబు పనిచేసిన కంపెనీ యజమాని / అధికారులతో మాట్లాడి అతని పార్థివ దేహంతో పాటు మరో వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇండియాకు పంపించారు. తేదీ 22.8.17న రాత్రి గల్ఫ్ఎయిర్ ప్లయిట్ నెం. GF274 ద్వారా బహరేన్ నుండి బయలు దేరి 23.8.17 ఉదయం 09:30గం లకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పంపించారు.

ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామానికి తరలించడానికి టీఆర్ఎస్ నిజామాబాదు ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత కల్వకుంట్ల గారి ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మరియు బాబురావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
వారి ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, సాయన్న, తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications