టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రారంభించనున్న కవిత
మెల్బోర్న్: ఎన్నారై టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ పోస్టర్‌ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రతినిధులు అనిల్ బైరెడ్డి, నాగేందర్ కాసర్ల ముందుగా ఈ అవకాశం కల్పించినందుకు ఎంపీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జూన్ 4వ తేదీన మెల్బోర్న్‌లో ఎన్నారై టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ను కవిత ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ శానబోయిన, సెక్రటరీ నవీన్ రెడ్డి, ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి, అధికార ప్రతినిధి నాగేందర్ కాసర్ల పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications