లండన్, బహ్రెయిన్లలో కెసిఆర్ బర్త్‌డే వేడుక(పిక్చర్స్)
లండన్: ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో యూకే(లండన్), బహ్రెయిన్, మస్కట్ దేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లో నిర్వహించిన కెసిఆర్ జన్మదిన వేడుకల్లో యూకే నలుమూలల నుంచి భారీగా టిఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.
ఎన్నారై టిఆర్ఎస్ లండన్ ఇంఛార్జ్ రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి కెసిఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నపటికీ కార్యక్రమానికి వచ్చినందుకు టిఆర్ఎస్ కార్యకర్తలకు, ఇతర సంస్థల ప్రతినిధులకు, ప్రవాస
తెలంగాణ బిడ్డలకు కృతఙ్ఞతలు తెలిపారు.
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాల గురించి వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని, అందరి సూచనలని తీసుకొని.. ముందుకు వెళుతోందని అన్నారు. కాబట్టి ఎవరైనా ఎటువంటి సలహాలు లేదా సందేహాలు ఉన్నా వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రతి తెలంగాణ బిడ్డా కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చడం చారిత్రక అవసరమని పిలుపునిచ్చారు. చివరికి నూతనంగా ఎన్నికైన హైదరాబాద్ మేయర్, డిప్యుటీ మేయర్ బొంతు రామ్మోహన్, ఫసియుద్దీన్‌లకు, గెలిచిన ప్రతీ కార్పొరేటర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, వెస్ట్ లండన్ ఇంఛార్జ్ మధు సుధన్ రెడ్డి, తెలంగాణ ఎన్నారై ఫోరం(టిఈఎన్ఎఫ్) అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్, ఉపాధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఐటి జాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, ముఖ్య నాయకులు శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సతీష్ బండ, సెరు సంజయ్, రాజేష్ వర్మ, సుమ దేవి, శ్వేతా, హాజరైన వారిలో ఉన్నారు.
బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ బిడ్డలు నివసించే ప్రాంతంలో పండ్ల పంపిణీ, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బహ్రెయిన్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్ తోపాటు సభ్యులు బొలిశెట్టి వెంకటేష్, రాజు, సుధాకర్, రాజేష్, ప్రకాశ్, ప్రభాకర్, ప్రశాంత్, సంజీవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో యూకే(లండన్), బహ్రెయిన్, మస్కట్ దేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
లండన్‌లో నిర్వహించిన కెసిఆర్ జన్మదిన వేడుకల్లో యూకే నలుమూలల నుంచి భారీగా టిఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారై టిఆర్ఎస్ లండన్ ఇంఛార్జ్ రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి కెసిఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నపటికీ కార్యక్రమానికి వచ్చినందుకు టిఆర్ఎస్ కార్యకర్తలకు, ఇతర సంస్థల ప్రతినిధులకు, ప్రవాస తెలంగాణ బిడ్డలకు కృతఙ్ఞతలు తెలిపారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ ఆహర్నిశలు కష్టపడ్తున్నారని, అందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని అన్నారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారై టిఆర్ఎస్ సెల్‌కి ఎప్పటికప్పుడు కెసిఆర్, యావత్ టిఆర్ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు
అలాగే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డ ఎక్కడుంటే అక్కడ ఎన్నారై టిఆర్ఎస్ శాఖలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేస్తామని చెప్పారు. ప్రత్యేకించి టిఆర్ఎస్ ఎంపి కవిత ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications