వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో కేరళ సంప్రదాయ ఉత్సవాలు

|
Google Oneindia TeluguNews

Kerala classical arts
దుబాయ్: ఐదు రోజుల అంతర్జాతీయ కూడియట్టం, కథాకళి ఉత్సవాలు(ఐకెకెఎఫ్) దుబాయ్ దేశంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కేరళ ప్రాచీన నృత్య రీతులను ప్రదర్శించారు. కేరళ సంప్రదాయ కళలను ఏడవ ఎడిషన్ సందర్భంగా దుబాయిలోని జిఈఎంఎస్ వెల్లింగ్టన్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రదర్శించారు.

కథాకలి నృత్యకారులు ప్రదర్శించిన నలచరితం ప్రదర్శన ఈ ఏడాది ఉత్సవాల్లో విశేషంగా ఆకట్టుకుంది. మహా భారతం నుంచి తీసుకన్న నిషాధ రాజు అయిన నల, అతని సతీమణి దమయంతిలకు సంబంధించిన నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ప్రముఖ కథాకలి నృత్యకారుడు కళామండలం గోపి ఉత్సవ ఐదవ రోజు తన ప్రదర్శన ఇవ్వనున్నారు.

కేరళ సంప్రదాయ కళలైన కూడియట్టం, కథాకలి, కేళి, మేలప్పడం, కూధూ, థాయంపకలను యూనైటెడ్ ఆరబ్ ఏమిరేట్స్ దేశాల్లో ప్రోత్సహించడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఎంతో ప్రాచూర్యం కలిగిన ఈ ప్రాచీన కళలను ఉత్సవాల ద్వారా ప్రదర్శిస్తున్నామని వారు చెప్పారు.

English summary
A five-day International Koodiyattam and Kathakali Festival ( IKKF), showcasing the ancient and highly structured classical performing arts of Kerala, began in Dubai Thursday, a media report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X