NRI News: కెనడాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు హైల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి.. కుల్జీత్ సింగ్ బేడీ..
కెనడాలో నివసిస్తున్న పంజాబీలు, భారతీయ విద్యార్థులకు భారతదేశం-కెనడా పరిస్థితుల గురించి తాజా సమాచారాన్ని అందించడానికి ప్రతి జిల్లాలో ఒక NRI హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ డిప్యూటీ మేయర్ కుల్జీత్ సింగ్ బేడీ పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌కు లేఖ రాశారు. పంజాబ్‌కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కెనడాలో స్థిరపడి పౌరసత్వం పొందారని బేడీ పేర్కొన్నారు.
"వెడ్డింగ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. పెద్ద సంఖ్యలో కెనడియన్ పౌరులు భారతదేశాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. పంజాబ్‌లో నివసిస్తున్న కెనడియన్ పౌరులు, వారి బంధువులు ప్రస్తుత పరిస్థితిపై చాలా గందరగోళంలో ఉన్నారు" అని చెప్పారు. జనవరిలో పంజాబ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో కెనడాకు వెళ్లాల్సి ఉందన్నారు. వారు ఇప్పటికే యూనివర్సిటీల్లో ఫీజులు చెల్లించారని పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమకు ఏమి జరుగుతుందో తెలియక గందరగోళంగా ఉందన్నారు.

కెనడాలో నివసిస్తున్న పంజాబీ పౌరుల కోసం జిల్లా స్థాయిలో ఎన్‌ఆర్‌ఐ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని తాజా పరిస్థితుల గురించి వారికి నిరంతరం సమాచారం అందించాలని ఆయన కోరారు. పంజాబ్ ప్రభుత్వం వెంటనే కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, భారత విదేశాంగ మంత్రికి కూడా ఈ ఆందోళనలపై అవగాహన కల్పించాలని బేడీ విజ్ఞప్తి చేశారు. గత జూన్ ఖలిస్తాన్ తీవ్రవాది నిజ్జర్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనక భారత ఎజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అనుమానం వ్యక్తం చేశారు.
ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడాలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు కెనడా కూడా భారత్ లో పర్యటించే తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. కెనడాలోని టొరంటోలో ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యక్తిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications