NRI News: సౌదీలో తండ్రి మృతి.. మృతదేహం కోసం వెళ్లిన కొడుక్కు షాక్..

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో మృతి చెందాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఒక పార్కులో మహ్మద్ షరీఫ్ శవమై కనిపించాడు. తండ్రిని చివరి సారిగా చూడడానికి వెళ్లిన కొడుకు మహ్మద్ మున్నా రియాద్‌కు చేరుకునే సమయానికి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంతో షాక్ కు గురయ్యాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన షరీఫ్ జూన్ 3న సౌదీ అరేబియా వెళ్లాడు. అతను రియాద్‌లోని ఓ క్లీనింగ్‌ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జూన్ 3న తాను సౌదీకి క్షేమంగా చేరుకున్నట్లు కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు.

షరీఫ్ కొడుకు రియాద్‌కు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌదీ అరేబియాలోని అల్ బహాలో పనిచేస్తున్నాడు. అయితే నాలుగు రోజుల తర్వాత అంటే జూన్ 7 నుంచి మహ్మద్ షరీఫ్ షరీఫ్ మృతదేహాన్ని అజీజియా పార్కులో కనుగొన్నారు. అయితే చనిపోయన వ్యక్తి షరీఫ్ అని గుర్తించడానికి 45 రోజులు పట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని గత వారం స్వదేశానికి తరలించారు. అక్కడ ఉన్న కొడుకు మున్నా తండ్రి చివరి సారిగా చూసేందుకు రియాద్ వెళ్లాడు. అయితే అప్పటికే షరీఫ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించారు.

Mohammad Sharif of Kamareddy district died in Riyadh Saudi Arabia

అయితే మున్నా తనకు ఇండియాకు రావడానికి డబ్బులు లేవని.. గత కొన్ని నెలలుగా యజమాని తనకు జీతం ఇవ్వలేదని పేర్కొన్నాడు. తనను ఎలాగైనా
భారతదేశానికి తిరిగి తీసుకెళ్లాలని కోరుతున్నాడు. అయితే మున్నా పని చేస్తున్న కంపెనీ బ్లాక్ లిస్టు ఉన్నట్లు తెలిసింది. అందుకే మున్నాకు కంపెనీ జీతం ఇవ్వడం లేదని తెలిసింది. దీనిపై కుటుంబ సభ్యులు మాట్లాడు. షరీఫ్ చనిపోయాడు. ప్రాణాలతో ఉన్న మున్నా సౌదీ అరేబియాలో ఇరుక్కుపోయాడని.. అతన్ని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+