టాటా ఆధ్వర్యంలో ఘనంగా 'మదర్స్ డే' వేడుకలు

కాలిఫోర్నియా: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆధ్వర్యంలో 'మదర్స్ డే' వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో ఉన్న ఓవెన్ బాంకెట్ హాల్ వేదికైంది. ఈ కార్యక్రమంలో మాతృత్వానికి ప్రతీకగా నిలిచే తల్లికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

తల్లులకు ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావించే ఈరోజును ఎంతో ఘనంగా ఓ వేడుకలా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహకులు నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ వైస్ ప్రెసిడెంట్ హరీందర్ తాళ్లపల్లి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాంతీయ కో ఆర్డినేటర్లు అయిన శిరీష తాళ్లపల్లి, ప్రవీణ కాసానగొట్టు, బిందు గండే, సరిత, సుచిత్రా రాంపురంలతో మొదలగునవారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆటలు, పాటలు, కూచిపూడి నాట్యం, ఫ్యాషన్ షో, టాలెంట్ షో, అవార్డుల ఉత్సవం, సూపర్ మామ్ పోటీలతో పాటు వివిధ రకాలైన గేమ్స్‌ను పెట్టారు. దీంతో పాటు కొంత మంది మహిళలు వారి పిల్లలతో తమకున్న సాన్నిహిత్యాన్ని వేదికపై షేర్ చేసుకున్నారు.

Mother's Day Los Angeles by Telangana American Telugu Association

టాటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత గణపతి పూజతో పాటు కొన్ని భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా టాటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సేవా రోజులు, 2017 సంవత్సరానికి సంబంధించి టాటా కన్వెన్షన్ ప్రోగ్రాంలను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన నటి లయను టాటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి సన్మానించారు. మహిళల పట్ల అవలంభించాల్సిన విధానాలతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలను చివరగా చర్చించి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ముగించారు. టాటా టీమ్ అడ్వైజర్ కౌన్సిల్ చైర్ డాక్టర్ మల్లా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+