టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా 'కాసర్ల..'
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత అక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా ఎంపీ కవిత టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి దానికి కార్యదర్శులను నియమించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ - ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్ల ను నియమించారు.
దీనికి సంబంధించి అక్టోబర్ లో పూర్తి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఎంపీ కవిత. దీంతో ఆస్ట్రేలియాలో రెండు వేర్వేరు విభాగాలుగా కొనసాగుతున్న పార్టీ ఎన్నారై బృందాలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి.. ఎంపీ కవిత గారి ఆదేశాల మేరకు ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్ఎస్ మరియు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎన్నారై సెల్ రెండు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తనకు అధ్యక్షునిగా అవకాశం కల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కి, అలాగే తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఎంపీ కవితకు ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications