ఆస్ట్రేలియాలో నాయని నరసింహ రెడ్డికి ఘనస్వాగతం
సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు అడుగుపెట్టిన హోం శాఖా మాత్యులు నాయని నరసింహ రెడ్డికి సిడ్నీలో ఘనస్వాగతం లభించింది.
శుక్రవారం ఉదయం సిడ్నీలోని కింగ్స్ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి నాయని నరసింహ రెడ్డికి ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులతో పాటు వివిధ తెలంగాణ సంఘాలైన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరమ్, ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.

ఇండియన్ కాన్సులర్ జనరల్ - స్.కే. వెర్మ - ఇండియన్ హై కమిషన్ - ఆస్ట్రేలియా తరఫున మర్యాద పూర్వకంగా స్వాగతించారు. ఈ పర్యటనలో నాయని నరసింహ రెడ్డి ఆస్ట్రేలియాలోని పలు రాజకీయ నాయకులను కలుసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అదే విధంగా డిసెంబర్ 2న ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, అనిల్ మునగాల, ప్రదీప్ సేరి, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్ , సుమేష్ రెడ్డి , వాసు తాట్కూర్, ప్రశాంత్ కడపర్తి, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలేట, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి , నరసింహా రెడ్డి తదితరులు నాయనికి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

ఏటిఫ్ ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో నాయని నరసింహరెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు - వి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు సంతోష్ గుప్తా పాల్గొంటారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications