తానా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిరంజన్ శృంగవరపు
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తానా నూతన అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల తన సమీప అభ్యర్థి నరేన్ కొడాలిపై ఆయన గెలుపొందారు. నిరంజన్‌కు 10866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9108 ఓట్లు లభించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన నిరంజన్ అమెరికాలోని మిషిగాన్‌లో నివాసముంటున్నారు. తానా ఎన్నికల్లో గెలుపుతో నిరంజన్ ప్యానల్ సంబరాలు చేసుకుంది. నిరంజన్ శృంగవరపు తానా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి అన్నారు. నిరంజన్ టీంకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశంవిడుదల చేశారు.

తానాలో గెలుపు ఓటములు ఉండవని, పోటీ చేసినవారంతా గెలిచినట్లేనని జై తాళ్లూరి వ్యాఖ్యానించారు. తానా అభ్యున్నతికి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తానా ఆధ్వర్యంలో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి అమెరికా, భారత్‌లో ఎందరికో ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉండగా, పోలైన ఓట్లు 21వేలు ఉన్నాయి. ఇక ఇక చెల్లని ఓట్లు 2,800 ఉన్నట్లు గుర్తించారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications