విమానంలో ముద్దు, అసభ్యంగా: దిగ్గున లేచిన స్త్రీ
న్యూయార్క్: ఓ 61 ఏళ్ల వ్యక్తి విమానంలో నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. పైగా ఆమెను తాకడం ప్రారంభించాడు, లైంగిక దాడికి ప్రయత్నించాడు. దాంతో ఆ మహిళ భయపడిపోయి దిగ్గున లేచింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానాశ్రయంలో విమానం దిగగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఘటన అమెరికాలోని హూస్యన్ నుంచి నెవార్క్‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది. నిందితుడిని భారతదేశానికి చెందిన దేవేందర్ సింగ్‌గా గుర్తించామని, అతని స్వస్థలం లూసియానా అని చెప్పారు.

అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు 2 లక్షల 50 వేల అమెరికన్ డాలర్ల జరిమానా పడే అవకాశం ఉందని చెప్పారు. న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు.
విండో సీటులో తాను నిద్రిస్తుండగా అతను తనను ముద్దు పెట్టుకోవడమే కాకుండా తన చేయిని చొక్కా కింద పెట్టాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించింది. అతన్ని పక్కకు తోసేసి తాను విమానం సిబ్బందికి వెళ్లినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications