ఆసీస్ యువతిపై రేప్: హైదరాబాదీకి జైలు శిక్ష

ఆర్థికంగా ఇబ్బందులు నెలకొనడంతో టాక్సీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2012, నవంబర్ 4న తన టాక్సీలో ఎక్కిన 17ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు మత్తుపానీయం సేవించి ఉండడంతో మరుసటి రోజు నితిన్ రానా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు నితిన్ రానాను అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితున్ని కోర్టులో హాజరు పర్చారు. కేసును విచారించిన కౌంటీ కోర్టు జడ్జి వెండీ విల్మత్... నితిన్ రానాను దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. యువతి మత్తుపానీయాలు సేవించిన సమయంలో రానా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆ యువతి దగ్గర ఉన్న ఐడి కార్డు సహాయంతో ఆమెను తన ఇంటి వద్ద దిగబెట్టాడు. ఆమెను భద్రంగా ఇంటికి చేర్చడంతో కుటుంబ సభ్యులు రానాకు 50 ఆస్ట్రేలియన్ డాలర్లను ఇచ్చారు. ఈ ఘటనతో తమ పిల్లలకు టాక్సీ ప్రయాణం చాలా భద్రత కలిగినదిగా వారు భావించి ఉంటారని న్యాయమూర్తి తెలిపారు. అయితే మరుసటి రోజు ఆ బాలిక తనను అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చాడని చెప్పడంతో బాలిక తల్లి టాక్సీ డ్రైవర్ రానాపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications