NRI news:అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ ఛాలెంజ్..!
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వర్జీనియాలో 5k వాక్/రన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విజయవంతంగా నిర్వహించింది. ఆగస్ట్ 20వ తేది ఆదివారం రోజున ఆష్ బర్న్ నగరంలోని W&OD ట్రైల్ ప్రాంగణంలో "ఆటా" 5k వాక్/రన్ ఫిట్ నెస్ ఛాలెంజ్ జరిగింది.ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు జయంత్ చల్లా మరియు ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఒక గంట పాటు వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలని పిలుపునిచ్చారు. అలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.
ఇక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చి చాలా సక్సెస్‌ఫుల్‌గా ఫిట్‌నెస్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీని మల్లపురం, ఆటా ఫిట్‌నెస్ ఛాలెంజ్ కో-ఆర్డినేటర్ షీతల్ బొబ్బకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆటా సంస్థ చేస్తున్న సేవా సహాయ కార్యక్రమాలను వారు వివరించారు. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో మొత్తం 50 మంది వరకు పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కార్యక్రమం జరగడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు విజ్ఞప్తి చేశారు.

అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 5k వాక్రన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్#5KRun #Oneindiatelugu pic.twitter.com/faTpF52ou1
— oneindiatelugu (@oneindiatelugu) August 22, 2023
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications