ఎన్నారై టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఇంఛార్జ్‌గా అనిల్

సిడ్నీ: టిఆర్‌ఎస్ పార్టీ అధికారిక ఆస్ట్రేలియా ఎన్నారై శాఖకు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆస్ట్రేలియా ఇంఛార్జ్‌గా అనిల్ బైరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఆస్ట్రేలియా ఇంఛార్జ్ అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ .. గతం లో వివిధ దేశాల్లో ఎలాగైతే పార్టీ అధికారిక శాఖలు నిర్వహించారో, అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఎంపీ కవిత ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో ఘనంగా ఆవిర్భావ సభను నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్నారై టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన తర్వాత ప్రవాస తెలంగాణ బిడ్డల నుంచి ఊహించని స్పందన వచ్చిందని చెప్పారు. ఇదంతా కేసీఆర్ అద్భుతమైన పాలనకు వస్తున్న స్పందనని, ప్రతీ ఒక్కరు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి వందలాదిగా ముందుకు వస్తున్నారని చెప్పారు.

NRI TRS Cell Australia Committee

అయితే, క్రియాశీలకంగా పని చేసే సభ్యులతో జాతీయ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని వాటి వివరాలు తెలిపారు.

ఎన్నారై టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఇంఛార్జ్ - అనిల్ బైరెడ్డి

అధికార ప్రతినిధి: డా. అనిల్ రావు చీటీ, నాగేందర్ కాసర్ల

జాతీయ కోర్ కమిటీ సభ్యులు: చంద్రశేఖర్ మోరంపూడి, విన్నితుముకుంట, రాజు
వీర్, శ్రీనివాస్ చింతల, రాజేష్ రాపోలు, ప్రకాష్ సూరపనేని, శ్రీనివాస్
కర్ర, మధు పైళ్ళ, కిరణ్ పాల్వై, చెన్న కేశవ్

ఐటి సెక్రెటరీ: రోహిత్ రెడ్డి

మీడీయా సెక్రెటరీ: అర్జున్ సీహెచ్

విక్టోరియా స్టేట్ కో-ఆర్డినేటర్లు: కిశోరె నక్క, సాయిరామ్ ఉప్పుట్రా, సనిల్ బాసీరెడ్డి

న్యూ సౌత్ వేల్స్ స్టేట్ కో- ఆర్డినేటర్లు: మహేష్ గుర్రాల, జశ్వంత్ కొడారపు, వేణు

క్వీన్స్ లాండ్ స్టేట్ కో-ఆర్డినేటర్లు : శ్రీధర్ బచనబోవ, శ్రీ గుజ్జురు

కాన్‌బెర్రా కో-ఆర్డినేటర్ : శ్రీధర్ రెడ్డి కాల్వ

ఇతర కమిటీ సభ్యులు: దినేష్ నేవురి, విజయ్ రెడ్డి మారాం,వంశీ కొట్టాల, మధు ప్రాస , జగన్, సాంబశివ రెడ్డి, అశ్వంత్ గౌరీషెట్టి, పవన్, సుధాకర్ ,భార్గ కాదారి, సందీప్ ఆలేది, వినయ్ కుమార్ నైనీ

నేటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై మెడలో గులాబీ కండువా లేకుండా టిఆర్ఎస్
పార్టీ, కేసీఆర్ అభిమానులుగా వారి వెంట ఉన్నామని, ఇక నేటి నుంచి
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా, ప్రవాస తెలంగాణా బిడ్డలకు(సంస్థలకు) -
పార్టీ కి /ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తామని నేతలు తెలిపారు.

అందరినీ కలుపుకొని ముందుకు పోతామని, మాకు ఈ అవకాశం కల్పించిన కేసీఆర్‌కి, ప్రత్యేకించి తమ అభ్యర్ధనను మన్నించి మమ్మల్ని ప్రోత్సహించినఎంపీ కవితకి, యావత్ టిఆర్ఎస్ నాయకులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టిఆర్ఎస్ ప్రతినిధులకు, ముఖ్యంగా ఎన్నారై టిఆర్ఎస్-అమెరికా నాయకుడు మహేష్ తన్నీరుకి ఎన్నారై టిఆర్ఎస్ సెల్-ఆస్ట్రేలియా శాఖ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+