ఆస్టిన్ లో NTR శతజయంతి వేడుకలు

కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

ఆస్టిన్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన ఆస్టిన్ తెలుగుదేశం పార్టీ 10వ మహానాడు జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. యువత, చిన్నారులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అన్నగారిని స్మరించుకుంటూ.. అయన తలపెట్టిన వినూత్న నిర్ణయాలు అలాగే అయన ఆశయ సాధనాలు, రాబోయే తరానికి వివరించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా దివాళా తీయించిందో అంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం రావల్సిన ఆవశ్యకతని వివరించారు. ఈ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

NTRs centenary celebrations were celebrated in Austin

కోమటి జయరాం మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి వెనకపడిపోయిందని, అట్టడుగు నుంచి మొదటి ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిందన్నారు. ఏపీ మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సి ఉందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్లుగానే అమరావతిని కూడా బాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+