డల్లాస్‌లో రాజా కృష్ణమూర్తికి ఘన స్వాగతం

డల్లాస్: డెమెక్రాటిక్ పార్టీ తరుపున ఇల్లినాయిస్ నగరంలోని 8వ కాంగ్రెన్షియల్ జిల్లా అభ్యర్ధిగా బరిలో నిలిచిన భారత సంతతి వ్యక్తి రాజా కృష్ణమూర్తికి డల్లాస్‌లో భారత సంతతికి చెందిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజా కృష్ణమూర్తి బాల్యం, విద్యాభ్యాసం అంతా ఇల్లినాయిస్‌లోని పియోరియాలో కొనసాగింది.

ప్రిన్సటన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన రాజా కృష్ణమూర్తి అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాజా కృష్ణమూర్తి శివనంతన్ ల్యాబ్స్ అండ్ ఎప్సీసోలార్ సంస్థ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తన భార్య ప్రియ డాక్టర్ కాగా, రాజాకు విజయ్, విక్రమ్ అనే ఇద్దరు కుమారులున్నారు.

Raja Krishnamoorthy for US Congress - Fundraising in Dallas

ఇల్లినాయిస్‌లోని స్కామ్‌బర్గ్‌లో నివసిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరుపున అమెరికా ఎన్నికల బరిలో నిలబడిన రాజా కృష్ణమూర్తి సుమారు 30 మంది మద్దతుదారులు, స్నేహితులతో డాక్టర్ ప్రసాద్ తోటకూరను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ తోటకూర యుఎస్ కాంగ్రెస్‌మెన్‌లో తనని ఒకడిగా చూడాలని ఆకాంక్షించారు. రాజా కృష్ణమూర్తి కోసం డిసెంబర్ 2వ తేదీన ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+