Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖాతర్‌లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం

హైదరాబాద్: ఉపాధి కోసం ఖతార్‌కు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 20 రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ ఖదీర్‌కు ఐదుగురు కొడుకులు ఉన్నారు.

పెద్ద కొడుకు ముక్తార్(30)ను బీటెక్ వరకు చదివించాడు. దేశంలో కంటే విదేశాలకు వెళితేనే ఎక్కువ డబ్బులు సంపాదించి, కుటుంబానికి అం డగా నిలవొచ్చనే ఉద్దేశంతో బీటెక్ చదివిన ముక్తార్ ఏడాదిన్నర కిందట ఖతార్‌కు వెళ్లాడు.

Rangareddy district man dead in Qatar

అక్కడ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇరవై రోజుల కిందట జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ఈ విషయం ముక్తార్ తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ పేదరికం కారణంగా మృతదేహాన్ని తీసుకురాలేకపోయారు.

దీంతో వారికి చివరి చూపు కూడా దక్కకుండాపోయాయి. ఖతార్ ప్రభుత్వమే అక్కడ దహన సంస్కారాలు నిర్వహించినట్టు ముక్తార్ సం బంధీకులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+