దుబాయ్ టెక్కీపై హైదరాబాద్ లేడీ టెక్కీ రేప్ కేసు
హైదరాబాద్: దుబాయ్‌కి చెందిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తనపై లైంగిక దోపిడికీ పాల్పడి మోసం చేశాడని సికింద్రాబాదుకు చెందిన పాతికేళ్ల లేడీ టెక్కీ సికింద్రాబాదులోని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దుబాయ్‌లో ఉంటున్న టెక్కీ హైదరాబాదుకు చెందినవాడని తెలిపింది. అతన్ని పెళ్లి చేసుకోవడానికి తాను మతం కూడా మార్చుకున్నట్లు తెలిపింది. నిందితుడు సదర్ అబ్బాస్ (30) ప్రస్తుతం దుబాయ్‌లో పనిచేస్తున్నాడు.

వారిద్దరి పరిచయం ప్రేమగా
నిందితుడు హైదరాబాదులోని దారుల్‌షిఫాకు చెందినవాడు. నాలుగేళ్ల క్రితం ఇరువురికి పరిచయం ఏర్పడింది. హైదరాబాదులోని సోమాజిగుడాలో గల ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు పనిచేస్తుండేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

వారిద్దరు సహజీవనం చేశారు..
వారిద్దరు సహజీవనం చేస్తూ వెళ్లారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నరు. అబ్బాస్‌ను వివాహం చేసుకోవడానికి లేడీ టెక్కీ మతం కూడా మార్చుకుంది. ఇరువురి కుటుంబ సభ్యులు సైతం వివాహానికి అంగీకరించారు.

ఇరువురి మధ్య విభేదాలు
అబ్బాస్ ఆమెపై ఆంక్షలు పెడుతూ వచ్చాడని, దాంతో ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. నెల క్రితం బాధితురాలు హైదరాబాద్ తిరిగి వచ్చింది. అబ్బాస్ మాత్రం దుబాయ్‌లోనే ఉండిపోయాడు. అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో లేడీ టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడంతో బాధితురాలు గురువారంనాడు బాధితురాలు రాచకొండ కమిషనరేట్ ఉన్నతాధికారులను గురువారం కలిసింది. దాంతో కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి డిసిపి సిహెచ్ఆర్ ఉమా మహేశ్వర శర్మ మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications