వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే వేదిక మీదికి వుమెన్ స్టార్స్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఆధ్వర్యంలో 2014, మార్చి 8న న్యూజెర్సీలోని ఎడిసన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో తెలుగు మహిళలు, యువత అమెరికాలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, పోటీల్లో విజయం సాధించిన సందర్భంగా, వారిని అభినందించే ఉద్దేశంతో వేడుకలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖుల ఉపన్యాసాలు, మొదటి, ద్వితీయ తరాల మహిళలు, యువత సాధించిన విజయాలపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలుగు మహిళలు, యువత సాధించిన విజయాలకు గాను అభినందనలు తెలియజేయడంతోపాటు వారు అందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. గత ఐదు దశాబ్దాలలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మహిళలు, యువతలో వస్తున్న మార్పులు, ఇటీవల జరుగుతున్న అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. విభిన్న రంగాలలో రాణించిన యువతను అభినందించేందుకు ఈ వేడుక వేదిక కానుందని తెలిపారు.

Reaching for the stars! TANA women and youth day

మిస్ అమెరికా 2014గా ఎంపికైన తెలుగు యువతి నీనా దేవులూరి అమెరికా ప్రజలతోపాటు ప్రపంచ ప్రజల మనసును గెలుచుకుందని ఆయన అన్నారు. ఆమె మిస్ అమెరికాగా ఎంపికైన తొలి తెలుగు యువతి అని తెలిపారు. నైనా దేవులూరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. సమావేశానికి నైనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని, ఆమె భారతీయ అమెరికన్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు.

అమెరికాలోని మేరీలాండ్ డెలిగేట్స్ హౌజ్‌కు ఎంపికైన తొలి మహిళగా అరుణ కాట్రగడ్డ మిల్లర్ చరిత్ర సృష్టించారని మోహన్ తెలిపారు. అరుణ మిల్లర్ ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరుకానున్నారని ఆయన చెప్పారు. అమెరికన్ ఐడల్ 2012 సీజన్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన సుభా వేదుల, టీవి రియాల్టీ షోలో టాప్ 20 మహిళల జాబితాలో భారత దేశం నుంచి ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారని తెలిపారు. సుభా వేదుల సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరవుతారని మోహన్ తెలిపారు.

ఇలాంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్న చాలా మంది మహిళలు, యువతకు ఈ సమావేశంలో అభినందనలు తెలియజేయనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 8న జరిగే ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకులచే సంకీర్తను, కళాకారులతో నృత్యాలు తదితర కార్యక్రమాలుంటాయని మోహన్ పేర్కొన్నారు. వివరాల కోసం మోహన్ నన్నపనేని (508) 612-6676 [email protected] సంప్రదించవచ్చని తెలిపారు.

English summary
Telugu Association of North America (TANA) is hosting a one day conference to celebrate the achievements of Telugu women and youth on Saturday, March 8, 2014 at Royal Albert Hall in Edison, New Jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X