ప్రముఖ విద్వాంసులకు శాక్రమెంటో తెలుగు సంఘం పురస్కారాలు

కాలిఫోర్నియా/విజయవాడ: ప్రతి ఏటా కర్నాటక విద్వాంసులను టాగ్స్ సత్కరించే సాంప్రదాయం కొనసాగింపు‌లో భాగంగా 2018 సంవత్సరానికి గాను విజయవాడకు పలువురు చెందిన ప్రముఖ విద్వాంసులకు టాగ్స్ పురస్కారాలు అందజేసినట్లు 'శాక్రమెంటో తెలుగు సంఘం' (టాగ్స్) బోర్డు ప్రకటించింది.

sacramento telugu association awards

1. పప్పు సదాశివ శాస్త్రి గారికి టాగ్స్ "జీవిత సాఫల్య పురస్కారం" ప్రదానం

2 కూచిభొట్ల మురళీ మోహన్ గారికి టాగ్స్ "20 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం" ప్రదానం

3.కూచిభొట్ల అపర్ణ గారు గారికి టాగ్స్ "10 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం" ప్రదానం

ప్రవాసాంధ్ర బాలుడు మాస్టర్ "నాగం విశ్రుత్" కర్నాటక సంగీత గాత్ర అరంగేట్రం జూలై 15, సాయంత్రం 5 గం. ప్రదర్శన లో భాగంగా "టాగ్స్ పురస్కార గ్రహీతలకు సన్మానం, అవార్డులు ప్రదానం' మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడ వద్ద 450 మందికిపైగా ఆహుతుల సమక్షంలో ఘనంగా జరిగింది .

sacramento telugu association awards

ముందుగా సిలికానంధ్ర సంస్థ చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల చేతులమీదుగా నిర్విరామంగా 320 గంటలు అన్నమాచార్య కీర్తనలు పాడిన పప్పు సదాశివ శాస్త్రికి టాగ్స్ "జీవిత సాఫల్య పురస్కారం" ప్రదానం ఘన సన్మానం చేసింది. అనంతరం విశ్రాంత ఆచార్యుడు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పద్మశ్రీ కొలకలురి ఇనాక్ చేతులమీదుగా ప్రముఖ కర్నాటక సంగీత వయొలిన్, గాత్ర విద్వాంసుడు కూచిభొట్ల మురళీ మోహన్ గారికి టాగ్స్ "20 ఏళ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం" ప్రదానం జరిగింది.

ఆ తర్వాత కూచిభొట్ల అపర్ణ గారికి టాగ్స్ "10 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం" ప్రదానం శారద కళా సమితి అధ్యక్షుడు శంకర రావు చేతులమీదుగా అందజేయబడినది. టాగ్స్ ట్రస్టీ, టాగ్స్ మాజీ చైర్మన్, టాగ్స్ మాజీ ప్రెశిడెంట్ నాగం వెంకటేశ్వర రావు ఈ టాగ్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

sacramento telugu association awards

నానాటికి కనుమరుగు అవుతున్న కర్నాటక గాత్ర సంగీతం కళాకారులకు అమెరికా-కాలిఫొర్నియా రాష్ట్రం రాజధాని శాక్రమెంటో నగరంలో జీవం పోస్తోంది ఈ 'టాగ్స్’ అని సంస్థ ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి తెలిపారు. కాగా, అమెరికాలో కాలిఫొర్నియా రాష్ట్రం లొ 2003 లో స్థాపించబడ్డ 'శాక్రమెంటో తెలుగు సంఘం' (టాగ్స్) కు శాక్రమెంటొ నగర పరిధిలో 3000 మంది ప్రవాసాంధ్రులు సభ్యులుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+