భారతీయ అమెరికన్‌కు అధ్యక్ష పురస్కారం

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ జీవశాస్త్ర అధ్యాపకుడు మూర్తి ఎస్ కంభంపాటి.. ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్ష పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్ బోధనలో నిపుణులుగా పేరున్న 15 మందిని అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వం అందులో మూర్తికీ స్థానం కల్పించింది.

ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నారు. అవార్డుతోపాటు రూ.6లక్షల నగదునూ బహూకరించనున్నారు. అమెరికాలోని హైస్కూల్, డిగ్రీ విద్యార్థుల పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా మూర్తి ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

మూర్తి ఆంధ్ర యూనివర్సిటీలో జీవావరణంలో, అమెరికాలోని జాక్సన్ స్టేట్ యూనివర్సిటీలో పర్యావరణశాస్త్రంలో పిహెచ్‌డీ చేశారు.

భారతీయుడిపై దాడి చేసిన పోలీసుకు జైలు

Scientist Murty Kambhampati chosen for U.S. presidential award

అలబామా: అమెరికాలో ఓ భారతీయుడిని నేలపైకి తోసేసి, గాయపర్చిన కేసులో అలబామా పోలీస్ అధికారిపై న్యాయాధిపతుల బృందం నేరారోపణ చేసింది. భారతీయుడైన సురేశ్‌భాయ్ పటేల్ (57)ను ఫిబ్రవరి 6న ప్రశ్నించే పేరుతో మాడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి ఎరిక్ పార్కర్ (26) కిందకు తోసేసి గాయపరిచాడు.

దీంతో ఆయన పాక్షిక పక్షవాతానికి గురయ్యాడు. ఎరిక్ పార్కర్ పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని, అకారణంగా అతనిపై బలప్రయోగం చేశాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే పార్కర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+