Mexico Bus Crash: మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు మృతి..

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు హైవే నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారని, అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందని ఓ అధికారి తెలిపారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోయ దాదాపు 50 మీటర్లు (164 అడుగులు) లోతులో ఉన్నందున రక్షించడం "చాలా కష్టం" అని నయారిత్ రాష్ట్ర భద్రత, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ చెప్పారు.

మరణించినవారిలో పద్నాలుగు మంది పెద్దలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. ఈ బస్సు ప్రయాణికులతో టిజువానా వైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులు కూడా మరణించారు. మృతుల్లో భారతీయులు, డొమెనిక్​ రిపబ్లిక్​, ఆఫ్రికెన్​ దేశస్థులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. గురువారం, నయారిట్ సివిల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక సిబ్బంది హైవేపై ఉన్న అంబులెన్స్‌ల ఫోటోలను, దిగువ లోయలో యూనిఫాం ధరించిన అధికారుల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

busaccidentinmexico1

ఎలైట్ ప్యాసింజర్ లైన్‌లో భాగమైన బస్సు రాష్ట్ర రాజధాని టెపిక్ వెలుపల హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో క్రాష్ అయినట్లు అధికారులు తెలిపారు. మూల మలుపు వద్ద డ్రైవర్ అతివేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయులు ఏ రాష్ట్రానికి చెందినవారో తెలియరాలేదు. గత నెలలో, దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 29 మంది మరణించారు.

ఫిబ్రవరిలో, దక్షిణ మరియు మధ్య అమెరికా నుండి వలస వచ్చిన మరొక బస్సు సెంట్రల్ మెక్సికోలో బస్సు ప్రమాదంలో 17 మంది మరణించారు. కొండ, లోయ ప్రాంతాల్లో అతి వేగం ప్రమాదకరమైన పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ల చాలా జాగ్రత్త వాహనాలు నడపాలని కోరారు. భారత్ లో కూడా బస్సు లోయలో పడిన ఘటనలు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+