అమెరికాలో తెలుగు విద్యార్ధి అనుమానాస్పద మృతి..?
ఉన్నత విద్య కోసం దేశాలకు వెళ్తున్న తెలుగు విద్యార్ధులు అనుకోని రీతిలో మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పలువురు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటే.. మరికొందరు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా కొందరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు మళ్లీ ఇదే తరహా ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానాస్పద రీతిలో తెలుగు విద్యార్ధి చనిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు, నాలుగేళ్ల క్రితం ఎం.ఎస్. చదవడం కోసం అమెరికా వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా అతను అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గోవర్ధన్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గోవర్ధన్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

గతంలో చోటు చేసుకున్న ఘటనలు..
2023లో ఒహియోలో తెలుగుకి చెందిన విద్యార్థి విశ్వనాథ్ కనుమూరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
2024 జనవరిలో, పురుషోత్తం తడేపల్లి అనే విద్యార్థి కాలిఫోర్నియాలో గన్‌షాట్ దాడిలో మరణించాడు. అతను స్టోర్‌లో పని చేస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు.
రీసెంట్ గా హైదరాబాద్‌కు చెందిన నవీన్ మట్టా, టెక్సాస్‌లో రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడు Uber డ్రైవింగ్ చేస్తూ డెలివరీకి వెళ్లే సమయంలో ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications