అమెరికాలో 9నుంచి సీతారాముల కళ్యాణోత్సవాలు

న్యూయార్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అమెరికాలో శ్రీ సీతారామాచంద్రుల కళ్యాణాన్ని జరిపించాలని నిర్ణయించింది. తానా తన సభ్యుల కోసం, అమెరికాలో స్థిరపడిన తెలుగువారి శ్రేయస్సు కోసం, ఇతర ఎన్నారైల కోసం ఈ కార్యక్రమాన్ని జరపాలని భావించినట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని అన్ని నగరాల్లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

TANA Co-ordinates Bhadrachala Kalyanams in USA

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిపించే పండితులను అమెరికాకు రప్పించి వారిచేతనే కళ్యాణోత్సవాన్ని ఎన్నారై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిపిస్తామని చెప్పారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయని మోహన్ చెప్పారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని చూడటానికి అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలను అందుకోవాలని కోరారు.

ఆగస్టు 9న డెట్రాయిట్, 10న కొలంబస్, 16న చికాగో, 17న క్లెవ్ లాండ్, 23న జాక్సన్ విల్లె(ఫ్లోరిడా), 24న ఓర్లాండో(ఫ్లోరిడా), 30న కనెక్టికట్, 31న అల్బనీ, సెప్టెంబర్ 1న బోస్టన్, 6న ఛార్లెట్(ఎన్‌సి), తదితర నగరాల్లో ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగనున్నాయి. తానాతోపాటు అమెరికాలో 11ఏళ్లుగా ప్రచురితమవుతున్న ‘తెలుగు టైమ్స్' కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్పంచుకుంటోందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+