ఆకట్టుకున్న ‘సిరివెన్నెల అంతరంగం’(పిక్చర్స్)
న్యూయార్క్: అమెరికాలోని అరోరాలోని బాలాజీ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ట్రిస్టేట్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ చికాగో సహకారంతో తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ‘సిరివెన్నెల అంతరంగం' పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి తోపాటు గాయకులు పార్థు, సాహితీలు పాల్గొన్నారు. తమ పాటలతో అలరించారు.
ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ.. తన పాటలకు స్ఫూర్తినిచ్చిన అంశాలను ప్రస్తావించారు. ఓటమితో కుంగిపోకుండా విజయంపై ఆశతో జీవన పోరాటం కొనసాగించాలని అన్నారు. మన సాంప్రదాయలు, పద్ధతుల గురించి ఆయన వివరించారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని తెలిపారు.
తానాతో తనకు గల సాన్నీహిత్యాన్ని సిరివెన్నెల వివరించారు. తెలుగు భాషాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పలు గీతాలను పార్థు, సాహితీ, ప్రవీణ్ జలిగామలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలు తెలుగు ప్రవాసాలు హాజరయ్యారు.
తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చౌదరి జంపాల మాట్లాడుతూ.. తానా చేసిన అనేక సామాజిక కార్యక్రమాలను వివరించారు. తాము చేపట్టబోయే మంచి కార్యక్రమాలకు తెలుగు ప్రజలు స్పందించి తమకు తోచిన మొత్తాన్ని విరాళాలుగా అందజేస్తున్నారని చెప్పారు. టిటిఏ సభ్యుడు జగదీష్ కానూరు, తానా మిడ్వెస్ట్ రీజినల్ రెప్రెంటేటివ్‌లు కార్యక్రమానికి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ కోలసాని, పద్మ సొంటి, హేమ కానూరు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సిరివెన్నెల పాటలు
అమెరికాలోని అరోరాలోని బాలాజీ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ట్రిస్టేట్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ చికాగో సహకారంతో తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ‘సిరివెన్నెల అంతరంగం' పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.

సిరివెన్నెల పాటలు
ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి తోపాటు గాయకులు పార్థు, సాహితీలు పాల్గొన్నారు. తమ పాటలతో అలరించారు.

సిరివెన్నెల పాటలు3
ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ.. తన పాటలకు స్ఫూర్తినిచ్చిన అంశాలను ప్రస్తావించారు. ఓటమితో కుంగిపోకుండా విజయంపై ఆశతో జీవన పోరాటం కొనసాగించాలని అన్నారు.

సిరివెన్నెల పాటలు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పలు గీతాలను పార్థు, సాహితీ, ప్రవీణ్ జలిగామలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలు తెలుగు ప్రవాసాలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications