అమెరికాలో డ్యాన్స్, సంగీతం క్లాస్‌లు

ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అఫియేషన్ నియమ నిబంధనల మేరకు, వారు నిర్దేశించిన కోర్సుల ప్రకారం అమెరికాలో వివిధ నగరాలలో వచ్చే ఉగాది నుండి కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొదటి మూడు సంవత్సరాలు తానా సంస్థ స్వయంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు, నాల్గవ సంవత్సరం లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ అధికారులు అమెరికా వచ్చి పరిక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు విశ్వవిద్యాలయ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారని తెలిపారు.
విదేశాలలో తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, ఆంధ్ర నాట్యం అన్ని కోర్సులను భోదించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వడం ఇదే తోలి సారి అని అందుకు విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలను తెలియ జేసారు.
అమెరికాలోని వివిధ నగరాలలో తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, ఆంధ్ర నాట్యం లలో కోర్సులను భోదించడానికి ఆసక్తి, అర్హత ఉన్న అధ్యాపకులు వెంటనే తమ అర్హతలతొ కూడిన వివరాలను prasadthotakura@gmailకు పంప వలసింది గాను, మరిన్ని వివరాలకు ప్రసాద్ తోటకూర ను 817-300-4747 లో సంప్రదించవలసిందిగా కోరుతున్నారు.












Click it and Unblock the Notifications