ఆకట్టుకున్న తానా ‘స్వరార్చన’(పిక్చర్స్)

పెన్సిల్వేనియా: లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ(ఎల్ఎంఏ)తో కలిసి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ టీం ప్రత్యేక సంగీత కార్యక్రమం ‘స్వరార్చన'ను గత శనివారం ఘనంగా నిర్వహించారు. రామాచారి, ఎల్ఎంఏ విద్యార్థులు తమ గానంతో ఆకట్టుకున్నారు.

పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా అప్పర్ మేరియన్ మిడిల్‌స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 300మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ప్రకాశ్ బత్తినేని వ్యవహరించారు.

ఎల్ఎంఏ విద్యార్థులు సుమారు 2గంటలపాటు నిరాటంకంగా ప్రదర్శనను కొనసాగించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎంసి అపర్ణ వాగ్వాల అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా తానా మిడ్ అట్లాంటిక్ టీం... రామాచారిని సత్కరించింది. అంతేగాక, ఎల్ఎంఏ భవనానికి రూ. లక్ష ప్రకటించారు.

స్వరార్చన

స్వరార్చన

లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ(ఎల్ఎంఏ)తో కలిసి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ టీం ప్రత్యేక సంగీత కార్యక్రమం ‘స్వరార్చన'ను గత శనివారం ఘనంగా నిర్వహించారు.

స్వరార్చన

స్వరార్చన

రామాచారి, ఎల్ఎంఏ విద్యార్థులు తమ గానంతో ఆకట్టుకున్నారు. పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా అప్పర్ మేరియన్ మిడిల్‌స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 300మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు.

స్వరార్చన

స్వరార్చన

కార్యక్రమ సమన్వయకర్తలుగా తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ప్రకాశ్ బత్తినేని వ్యవహరించారు.

స్వరార్చన

స్వరార్చన

ఎల్ఎంఏ విద్యార్థులు సుమారు 2గంటలపాటు నిరాటంకంగా ప్రదర్శనను కొనసాగించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కాగా, రవి మండలపు 500 డాలర్లను విరాళంగా ప్రకటించారు. ఫిలడెల్ఫియా తానా టీం నాగరాజు నలజుల, సతీష్ తుమ్మల, బాబీ యెర్ర కార్యక్రమం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. సహాయ సహకారాలు అందించిన భరత్, ఉషా రమకలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరి, టిఏజిడివి సెక్రటరీ సాంబయ్య కోటపాటి, ట్రెజరర్ కిరణ్ కొత్తపల్లి, జాయింట్ సెక్రటరీ సురేష్ వెంకన్నగారి, ఈసి సభ్యులు గోపీ వాగ్వాల, నాగరాజు నలజుల, శృతి అధ్యక్షులు శాంతి కనుమళ్ల, లక్ష్మీ మంద, శ్రీనివాసు బర్తవరపు, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక, వేణు బత్తిని, ప్రసాద్ కూనారపు, హరి మహర్షి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+