Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాంటెక్స్ 102వ నెల నెలా తెలుగు వెన్నెల(పిక్చర్స్)

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ప్రతి నెల నిర్వహించే ‘నెల నెలా తెలుగు వెన్నెల 102 వ సదస్సు జనవరి 24న(ఆదివారం) డల్లాస్ నగరంలోని దేశీప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఆ తర్వాత 2016 సంవత్సరానికి తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన బిళ్ళ ప్రవీణ్‌ను దండ వెంకట్ సభకు పరిచయం చేశారు.

బిళ్ళ ప్రవీణ్ సారధ్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలు నూతన శోభ సంతరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. బిళ్ళ ప్రవీణ్ స్పందిస్తూ.. భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను, స్థానిక సాహిత్యభిమానులను అభినందిస్తూ, 2016 సంవత్సరంలో సహాయ సహకారాలని కోరుతూ ఆసక్తివున్న వారిని ఆహ్వానించారు.

కార్యక్రమం ప్రారంభంలో ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించి, వడ్లమన్నాటినాగేష్, కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి దొడ్ల నిర్జర, దొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను సభకు పరిచయం చేస్తూ.. కథా రచయిత సి. రామచంద్రరావు 9 కథలు వ్రాశారని, వేటికవే సాటి అని చక్కగా వివరించారు.

తదుపరి జలసూత్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే ‘చేరడం' అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుందని చెప్పారు. ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని ఇలా సంక్రాంతికి సంబంధించి ఎన్నో విషయాలను ఆద్యంతం ఆసక్తిగా వివరించారు.

మాడ దయాకర్ మాట్లాడుతూ.. మన తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని, శ్రీ శ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని ఎంతో హాస్య భరితంగా పేరడీ పరేడ్ నిర్వహించారు. ప్రముఖ రచయిత రమణ, విశ్వనాథ సత్యనారాయణ "పిచ్చి ప్రేమ" అనే సినిమా పై సమీక్ష రాయమంటే విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు. దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు.

వేముల లెనిన్ తన కమ్మని గాత్రం తో అసాధారణ జ్ఞాపక శక్తితో "తల్లీ నిను దలంచి" అంటూ మాడుగుల నాగ ఫణి శర్మ గారు రచించిన గీతాన్ని వీనుల విందుగా పాడి వినిపించారు. డా. జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం(టాంటెక్స్)ప్రతి నెల నిర్వహించే ‘నెల నెలాతెలుగు వెన్నెల 102 వ సదస్సుజనవరి 24న(ఆదివారం) డల్లాస్ నగరంలోని దేశీప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంభమైంది.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

ఆ తర్వాత 2016 సంవత్సరానికి తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన బిళ్ళ ప్రవీణ్‌ను దండ వెంకట్ సభకు పరిచయం చేశారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

బిళ్ళ ప్రవీణ్ సారధ్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలు నూతన శోభ సంతరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. బిళ్ళ ప్రవీణ్ స్పందిస్తూ.. భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను, స్థానిక సాహిత్యభిమానులను అభినందిస్తూ, 2016 సంవత్సరంలో సహాయ సహకారాలని కోరుతూ ఆసక్తివున్న వారిని ఆహ్వానించారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

కార్యక్రమం ప్రారంభంలోఘంటసాల లలిత గీతాలనువీనుల విందుగా ఆలపించి,వడ్లమన్నాటినాగేష్,కుందేటి చక్రపాణిఅలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి దొడ్లనిర్జర, దొడ్లరమణకమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను సభకు పరిచయం చేస్తూ..కథా రచయిత సి. రామచంద్రరావు 9 కథలు వ్రాశారని,వేటికవే సాటి అని చక్కగా వివరించారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

తదుపరిజలసూత్రంచంద్రశేఖర్ మాట్లాడుతూ..సంక్రాంతి లేదా సంక్రమణం అంటే ‘చేరడం' అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుందని చెప్పారు. ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని ఇలా సంక్రాంతికి సంబంధించి ఎన్నో విషయాలను ఆద్యంతం ఆసక్తిగావివరించారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

మాడదయాకర్మాట్లాడుతూ..మన తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని, శ్రీ శ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అనిఎంతో హాస్య భరితంగా పేరడీ పరేడ్ నిర్వహించారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

ప్రముఖ రచయిత రమణ, విశ్వనాథ సత్యనారాయణ "పిచ్చి ప్రేమ" అనే సినిమా పై సమీక్ష రాయమంటే విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు. దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

వేముల లెనిన్ తనకమ్మని గాత్రం తో అసాధారణ జ్ఞాపక శక్తితో "తల్లీ నిను దలంచి" అంటూ మాడుగుల నాగ ఫణి శర్మ గారు రచించిన గీతాన్ని వీనుల విందుగా పాడి వినిపించారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల

డా. జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" నిwww.madhuravani.comద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు.

నెల నెలా తెలుగు వెన్నెల

నెల నెలా తెలుగు వెన్నెల



ఈనాటి ముఖ్య అతిధిని కార్యక్రమ సమన్వయకర్త పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వానించగా.. రాణి భట్రాజు డా.సుధకి పుష్పగుచ్చం అందచేశారు. తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలుసాధించి, చిన్న తనం నుండి నాట్యం పై మక్కువ పెంచుకొని జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న తెలుగు మహిళ డా. కలవగుంట సుధ "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడారు.

ఈనాటి ముఖ్య అతిధిని కార్యక్రమ సమన్వయకర్త పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వానించగా.. రాణి భట్రాజు డా.సుధకి పుష్పగుచ్చం అందచేశారు. తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, చిన్న తనం నుండి నాట్యం పై మక్కువ పెంచుకొని జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న తెలుగు మహిళ డా. కలవగుంట సుధ "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడారు.

మొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితములో శ్రీశైలం - శివరాత్రి - జాగరణ గురించి యక్ష గానాల గురించి ప్రస్తావించారు, 14వ శతాబ్దంలో మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో యక్షగాన సమస్త పదాన్ని, ద్రాక్షారామ ప్రశంస సందర్భంలో ప్రస్తుతించారని తెలిపారు.

16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు ... " అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారు. ఆధునిక యుగంలో యక్షగానానికి పుట్టినిల్లు తెలుగు గడ్డ అని, క్రమేపీ తెలుగులో ఆదరణ తగ్గిపోవడం వలన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకకు వలస పోయిందని తెలిపారు. తెలుగు యక్ష గాయకులు, సొంత గాత్రంతో కార్యక్రమాలు చేస్తే, కర్ణాటక వారికి రంగస్థలం బయట నుండి గాత్ర సాయం అందుతుందని తెలిపారు.

డా . సుధ తమ పరిశోధనల నిమిత్తం తెలుగు రాష్టాలలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి లెక్కలేనన్ని గ్రామాలు తిరిగి, యక్ష గానాన్ని వృత్తిగా చేసుకొన్న కుటుంబాలను కలిసి, వారి అనుభవాలు గ్రంథస్తం చేసి, ఛాయా చిత్రాలు, దృశ్యమాలికలు తీసి వాటిని పదిలపరిచారు. వాటనన్నిటినీ ఈ సభలో ప్రదర్శించి వివిధ యక్ష గాన ప్రక్రియలను స్వయంగా చూసే అవకాశం కల్పించారు.

ఆ దృశ్యాలు అపురూపమైనవి, అజరామరమైనవి, వాటిని చూసిన ప్రేక్షకుల ఆనందానికి
అవధులు లేవు. డా. సుధ తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు. సుధ స్వయంగా గొప్ప కూచిపూడి కళాకారిణి కావడంతో వారికి తన పుట్టిల్లుకు వెళ్ళిన అనుభవం కలిగిందని చెప్పారు.

ఆ అనుభవాలను సభలో పంచుకొని అందరి మనసులో యక్షగాన కళల పట్ల మరింత ఆసక్తి కలుగచేశారు. ఇలా మరుగున పడిపోతున్న కళలను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఒక గృహిణి, మాతృమూర్తి, అమెరికాలో స్థిరపడినా తెలుగు భాష, కళలపై ఎంతో మక్కువతో, తన చిన్న పిల్లలను ఇద్దరిని తన వెంట తీసుకొని, కాలినడకన ఎన్నో తెలుగు పల్లెలలో పర్యటించి, అలుపెరుగని బాటసారిలా, తెలుగు కళలను పరిరక్షించే సరస్వతి పుత్రికగా ఆవిడ చేసిన సేవలకు రాష్ట్రపతిచే పురస్కారం, లెక్కలేనన్ని అవార్డులు ఎన్నో తనను వరించినా, వీటన్నిటి కన్నా తెలుగు నేల మీద తొలి అడుగులు వేసిన యక్ష గానం ఇంకా విస్తరించేలా చేయడంలోనే నిజమైన ఆనందం అని డా. సుధ ఆహూతులు అభినందించారు.

డా. కలవగుంట సుధని టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతో, కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కొత్త జసదస్సు జరుపుకోవడం మహదానందంగా ఉందని అన్నారు.

సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ.. టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంది, మన స్థానిక కళాకారులను ఈ విధంగా సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మి, గోవాడ అజయ్, తోట పద్మశ్రీ ,కొణిదల లోకేష్ నాయుడు, సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు.

టాంటెక్స్ 102 నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి చంద్రశేఖర్ జలసూత్రం వివరించారు.
కార్యక్రమ విశేషాలను చిత్రాల ద్వారా చూడవచ్చును.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+