అలరించిన టాంటెక్స్ ‘స్వరాభిషేకం’(పిక్చర్స్)
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వరాభిషేకం' కార్యక్రమం ఆలెన్ ఈవెంట్ సెంటర్‌లో దిగ్విజయంగా నిర్వహించింది. డల్లాస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి సంగీతాభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సమన్వయకర్తగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య విచ్చేసిన సంగీత ప్రియులను స్వాగతిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త వనం జ్యోతి కార్యవర్గ, పాలకమండలి సభ్యులను పరిచయం చేసి, పోషక దాతలను బాలు చేతులమీదుగా అభినందనల పుష్పగుచ్ఛాలను అందుకోవలసిందిగా అహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో పాటు ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు మనో, సునీత, ఎస్పి చరణ్, గీతామాధురి, మాళవిక, శ్రావణ భార్గవి, హేమచంద్ర, శ్రుతి, హారిక, కార్తిక్, ప్రవీణ్ తదితరులు పాల్గొని ఆహూతులను స్వర ఝరిలో ముంచెత్తారు.

స్వరాభిషేకం
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వరాభిషేకం' కార్యక్రమం ఆలెన్ ఈవెంట్ సెంటర్‌లో దిగ్విజయంగా నిర్వహించింది.

స్వరాభిషేకం
డల్లాస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి సంగీతాభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

స్వరాభిషేకం
టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సమన్వయకర్తగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

స్వరాభిషేకం
కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య విచ్చేసిన సంగీత ప్రియులను స్వాగతిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్వరాభిషేకం
సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త వనం జ్యోతి కార్యవర్గ, పాలకమండలి సభ్యులను పరిచయం చేసి, పోషక దాతలను బాలు చేతులమీదుగా అభినందనల పుష్పగుచ్ఛాలను అందుకోవలసిందిగా అహ్వానించారు.

స్వరాభిషేకం
ఈ కార్యక్రమంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో పాటు ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు మనో, సునీత, ఎస్పి చరణ్, గీతామాధురి, మాళవిక, శ్రావణ భార్గవి, హేమచంద్ర, శ్రుతి, హారిక, కార్తిక్, ప్రవీణ్ తదితరులు పాల్గొని ఆహూతులను స్వర ఝరిలో ముంచెత్తారు.

స్వరాభిషేకం
ఈటీవీ ద్వారా భారతదేశంలో 4 లేదా 5 భాగాలుగా ఈ కార్యక్రమంలో ప్రసారంకానుందని నిర్వాహకులు తెలిపారు.

స్వరాభిషేకం
హేమచంద్ర పాడిన ‘రసికరాజ తగువారముగామా', బాలు ఆలపించిన ‘చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో' కార్యక్రమంలో కొసమెరుపుగా నిలిచాయి.

స్వరాభిషేకం
అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. డల్లాస్ చరిత్రలో 3500 మంది పైగా తెలుగువారితో అన్ని జాతీయ, స్థానిక అనుబంధ సంస్థలతో కలిసి ఇంత మహత్తర కార్యక్రమాన్ని టాంటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో చేయడం ఆనందంగా ఉందన్నారు.

స్వరాభిషేకం
ఇంతటి భారీ కార్యక్రమం విజయవంతం కావాలంటే పోషకదాతలు, స్వచ్చంద సేవకులు ఎంత ముఖ్యమో, ప్రేక్షకులుగా మీ అందరి ఆదరణా అంతే అవసరం అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.

స్వరాభిషేకం
మధురంగా పాడటమే కాకుండా, కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గాయని సునీత మాట్లాడుతూ.. ఇంత పెద్ద సభాప్రాంగణం నిండుగా కళకళ లాడుతూ ఉండటమే కాకుండా, దాదాపు 4వేలమంది తెలుగువారు అన్ని వయసులవారూ ఉండటం మనసుకు ఎంతో ఆనందాన్నిస్తోందని అన్నారు.

స్వరాభిషేకం
‘నేను ఒక చిన్న విద్యార్థిని మాత్రమే, నేనూ ఈ బృందం లో ఒక గాయకుడిని మాత్రమే. నేను విశ్వ మానవుడిని, మీ గుండె నా ఇల్లు' అని బాలు తన ఔన్నత్యాన్ని మరొక్కమారు ప్రదర్శించారు.
హేమచంద్ర పాడిన ‘రసికరాజ తగువారముగామా', బాలు ఆలపించిన ‘చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో' కార్యక్రమంలో కొసమెరుపుగా నిలిచాయి. అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. డల్లాస్ చరిత్రలో 3500 మంది పైగా తెలుగువారితో అన్ని జాతీయ, స్థానిక అనుబంధ సంస్థలతో కలిసి ఇంత మహత్తర కార్యక్రమాన్ని టాంటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఇంతటి భారీ కార్యక్రమం విజయవంతం కావాలంటే పోషకదాతలు, స్వచ్చంద సేవకులు ఎంత ముఖ్యమో, ప్రేక్షకులుగా మీ అందరి ఆదరణా అంతే అవసరం అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యవర్గ, పాలకమండలి సభ్యులు సంయుక్తంగా గాయనీ గాయకులను సన్మానించారు. కార్యవర్గ సభ్యులు గజ్జెల రఘు మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సంగీత ప్రియులకు, పోషకదాతలకు, స్వచ్చంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications