అలరించిన టాంటెక్స్ ‘స్వరమంజరి’(పిక్చర్స్)
డల్లాస్: ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వరమంజరి' పాటల పోటీలు ఎంతగానో అలరిస్తున్నాయి.
‘స్వరమంజరి' పాటల పొటీల కార్యక్రమం నాల్గవ ఆవృత్తం డాల్లస్ మహానగర ప్రాంతంలోని సెయింట్ మేరిస్ చర్చ్‌లో అక్టోబర్ 31వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే నాలుగు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. మొదటి ఆ వృత్తంలో 30మంది కళాకారులు తలపడగా నాల్గవ అవృత్తానికి చేరుకునేసరికి పది మంది కళాకారులు మాత్రమే ఈ పోటీలో గెలిచి నిలిచారు.
ప్రతి ఒక్కరూ ఏమాత్రం శక్తి వంచన లేకుండా చివరి వరకు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అటు శ్రోతలను ఇటు న్యాయ నిర్ణేతలను మెప్పించేందుకు ప్రయత్నించారు. డిసెంబర్ నెల 5 వ తేదీన స్వరమంజరి గ్రాండ్ ఫినాలే పోటీలను డాల్లస్ లోని ‘జాక్ షింగ్లీ' ఆడిటోరియం వేదికగా నిర్వహిస్తున్నారు.
సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉప్పలపాటి, ముఖ్య అతిథి, ప్రధాన న్యాయనిర్ణేత విజయలక్ష్మి, స్థానిక న్యాయనిర్ణేతలు రాజశేఖర్ సూరిభొట్ల, శ్రీనివాస్ ప్రభల, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి, కోశాధికారి కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి వేణు పావులూరి, కార్యవర్గ సభ్యులు శ్రీలక్ష్మి మండిగ, జ్యొతీ వనం వెంకట్ దండ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతీ ప్రజ్వలనతో ప్రారంభించారు.
టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు ఇందు పంచార్పుల, జయ తెలకలపల్లి, పల్లవి తోటకూర, మాధవి సుంకిరెడ్డి, నరేష్ సుంకిరెడ్డి, వెంకట్ కోడూరి, పాల్గొన్నారు. ఈ పాటల పోటీలకు ప్రధాన సంధానకర్తగా అశ్విన్ కౌత వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జయ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ప్రముఖ గాయని విజయలక్ష్మి, రాజశేఖర్ సూరిభొట్ల శ్రీనివస్ ప్రభల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాకారుల్లోని ప్రతిభా పాటవాలను పరిచయం చేసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో తోడ్పడతాయని టాంటెక్స్ కృషిని ప్రశంసించారు.
శాస్త్రీయం, జానపదం, భక్తి, వైరాగ్య, సినీ సంగీతాన్ని హృదయం స్పందించే విధంగా గాయనీ గాయకులు పాటలను తగినట్లుగా గానం చేసి అందరినీ మెప్పించారు. ఇందులో ముందుగా అశ్విన్ కౌత భక్తకన్నప్ప చిత్రం నుండి కిరార్తార్జునీయం అంశం పాడి పోటీకి నాంది పలికారు. అటుతర్వాత పూజిత కడిమిసెట్టి, మురళీ హనుమంతకారి ప్రభాకర్ కొట, ఆషాకీర్తి ధర్మపురి, నాగి వడ్లమన్నాటి, సంగీత మరిగంటి, సాయి రాజేష్ మహాభాష్యం, జానకి శంకర్, చక్రపాణి కుందేటి, ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు.
ఈ పాటల పోటీలకు ఆడియో అందించినవారు బాల గణపవరపు, వీడియో వెంకట్ జొన్నాడ, ఫొటోగ్రాఫి భాస్కర్. టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు.

స్వరమంజరి
ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వరమంజరి' పాటల పోటీలు ఎంతగానో అలరిస్తున్నాయి.

స్వరమంజరి
‘స్వరమంజరి' పాటల పొటీల కార్యక్రమం నాల్గవ ఆవృత్తం డాల్లస్ మహానగర ప్రాంతంలోని సెయింట్ మేరిస్ చర్చ్‌లో అక్టోబర్ 31వ తేదీన ఘనంగా నిర్వహించారు.

స్వరమంజరి
ఇప్పటికే నాలుగు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. మొదటి ఆ వృత్తంలో 30మంది కళాకారులు తలపడగా నాల్గవ అవృత్తానికి చేరుకునేసరికి పది మంది కళాకారులు మాత్రమే ఈ పోటీలో గెలిచి నిలిచారు.

స్వరమంజరి
ప్రతి ఒక్కరూ ఏమాత్రం శక్తి వంచన లేకుండా చివరి వరకు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అటు శ్రోతలను ఇటు న్యాయ నిర్ణేతలను మెప్పించేందుకు ప్రయత్నించారు.

స్వరమంజరి
డిసెంబర్ నెల 5 వ తేదీన స్వరమంజరి గ్రాండ్ ఫినాలే పోటీలను డాల్లస్ లోని ‘జాక్ షింగ్లీ' ఆడిటోరియం వేదికగా నిర్వహిస్తున్నారు.

న్యాయ నిర్ణేతలు
ప్రత్యేకించి స్థానికంగా ఉన్న కళాకారుల్లోని ప్రతిభను చాటి చెప్పేందుకు ప్రత్యేకమైన వేదికను కల్పించాలనే సదుద్దేశంతో టాంటెక్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సాగుతున్న ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పాలి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications