Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మార్చి 28న టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు (ఫోటోలు)

డల్లాస్: శ్రీ మన్మధనామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ 'ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్)' తరపున అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. తెలుగు వారి తొలి పండుగ "ఉగాది ఉత్సవాలు" యూలెస్‌లోని ట్రినిటీ హైస్కూల్ లో శనివారం, మార్చి 28, 2015 మధ్యహ్నం 3 గంటల 30 నిముషాలకు అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టాంటెక్స్ కార్యవర్గ మరియు స్వచ్చంద సేవకుల బృందం తెలుగింటి పండుగ సందడులను, కళకళలను మన వేడుకలో కనిపించనున్నాయి.

TANTEX Ugadi Utsavalu 2015 held on March 28

ఈ సంవత్సరం, కార్యక్రమాల నాణ్యత పెంచడం ముఖ్య ఉద్దేశ్యంగా "ఉగాది ఉత్సవాలు" కార్యక్రమాలు వినూత్నంగా ప్రజారంజకంగా రూపొందించారు. టాంటెక్స్ వేదికపై మొట్టమొదటి సారిగా 400 మంది స్థానిక చిన్నారులు, కళాకారులతో జరుగబోయే ఈ కార్యక్రమానికి టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యవర్గ బృందం ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చు.

ఆడ పిల్లలు, మగ పిల్లలు, స్రీలు, పురుషులు మరియు దంపతులు విభాగాలలో మొత్తం ఐదు బహుమతులు కేటాయించారు. స్థానిక కళాకారుల శాస్త్రీయ, సినీ మరియు జానపద నృత్య ప్రదర్శన తరువాత, సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, మీ కోరిక మేరకు ఒక గంటన్నర "అచ్చట్లు ముచ్చట్లు" చెప్పుకుంటూ గడిపేందుకు వీలుగా ఉగాది పచ్చడితో మొదలు పెట్టి, "బావర్చి - ప్లేనో" వారి కమ్మని పండుగ భోజనంతో పాటు తేనీరు, అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు

భోజన అనంతరం ఉర్రూతలూగించే కార్యక్రమంతో ముందుకు నడిపించడానికి, తన మాటలతో సందడి చేయడానికి ప్రముఖ వ్యాఖ్యాత శ్రీలక్ష్మి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు తెలియజేస్తారు. తరువాత దాదాపు రెండుగంటల పాటు మిమ్మల్ని సంగీత విభావరితో శ్రవణానందంలో ముంచెత్తడానికి ప్రముఖ నేపథ్య గాయకుడు కారుణ్య, నేపథ్య గాయని ఆదర్షిణి, హనిష్క పొలిమెర రానున్నారు.

TANTEX Ugadi Utsavalu 2015 held on March 28

"ఉగాది ఉత్సవాలు" కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య, తెలుగు భాష వంటి రంగాలలో విశిష్ఠ సేవలందించిన ప్రతిభావంతులకు ఉగాది పురస్కారంతో సన్మానించడం, అలాగే ఎటువంటి లాభాపేక్ష లేని అత్యుత్తమ స్వచ్చంద సేవకులను గుర్తించి, గౌరవించడం మన సంస్థ ఆనవాయితీ. ఉగాది ఉత్సవాలు కార్యక్రమానికి పెద్దల టికెట్ రాయితీతో tantex.org మరియు mydealshub.com లో మార్చి 22 వరకు లభ్యమవనున్నాయి.

ముందుగా కొనడానికి వీలుకుదరని పక్షంలో కార్యక్రమ వేదిక వద్ద రాయితీ లేకుండా కొనుగోలు చేయవచ్చు. సమయాభావం వల్ల ఇటువంటి ఇబ్బందులు పడకుండా, ఈ సంవత్సరం కొత్తగా అటు సభ్యులకు, ఇటు సంస్థకు అనుకూలంగా ఉండేలా "టాంటెక్స్ సీజన్ పాస్" ప్రవేశపెట్టడం జరిగింది.

ఉదాహరణకు ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక సగటు కుటుంబం ఈ సీజన్ పాస్ కొనడం వల్ల ప్రత్యేకంగా సీటింగ్ తో పాటు కనీసం 60శాతం పొదుపు చేసుకోవచ్చు. షడ్రుచుల కలబోతలా కమ్మగా అన్ని రుచులతో నిత్యనూతనంగా మీ సంవత్సరం సాగాలి అని ఆకాంక్షిస్తూ, షడ్రుచుల సమాహారంతో మొదలయ్యే ఈ ఉత్సవాలకు తెలుగు వారందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+