ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మనదేశంలోనే గాక, విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులు కూడా కేసీఆర్ జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకున్నారు.

కువైట్‌లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
కువైట్ దేశంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు ఎన్నారై బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, కువైట్ జాగృతి అధ్యక్షులు వినయ్ ముత్యాల నాయకత్వంలో కేక్ కట్ చేసి.. సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆధర్శంగా నిలుస్తున్నాయన్నారు. కేసీఆర్ ను ప్రధానిగా చూడాలని బీఆర్ఎస్ కువైట్ తరపున కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

లండన్‌లో కేసీఆర్ జన్మదిన సంబరాలు
బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోనూ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ కోశాధికారి జీ సతీష్ రెడ్డి గొట్టెముక్కల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి 150 మందికిపైగా బీఆర్ఎస్ ఎన్నారై కార్యకర్తలు, ఇతర ప్రవాస కుటుంబసభ్యులు తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, దేశాన్ని నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం ఫోన్ ద్వారా అందరితో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని, సందర్భం ఏదైనా సీఎం నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు మనకు ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, బీఆర్ఎస్ నేతలు అబుజాఫర్, సీఎం కేసీఆర్ కు అడ్వైజరీ బోర్డు వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్, ఎన్నారై ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శి హరిగౌడ్ నవాబుపేట్, అధికార ప్రతినిధి రవిప్రదీప్ పులుసు, లండన్ ఇంఛార్జీ నవీన్ భువనగిరి, ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, గణేష్ పస్తం, సతీష్ రెడ్డి బండా, గణేష్ కుప్పలా, ప్రశాంత్ మామిడాల, సురేష్ బుడగం, ప్రవాస సంఘాల నాయకులు శుష్మునా రెడ్డి, స్వాతి బుడగం, ప్రవళిక భువనగిరి, స్నేహ, నందిని తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలోని అనేక నగరాల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండిగో, బల్లారాట్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వినయ్ సన్నీగౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో నిర్వహించిన వేడుకల్లో కాసర్ల నాగేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. సాయికృష్ణ కల్వకుంట్ల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర మంత్రిపడగ, సతీష్ పులిపాక, సంతోష్, వెంకటేష్ తిరువీధుల తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, అమెరికా, సౌతాఫ్రికా తోపాటు ఇతర దేశాల్లోని ప్రవాసులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తెలంగాణ సీఎంకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.
-
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు












Click it and Unblock the Notifications