టిడిఎఫ్ ఆధ్వర్యంలో టి ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)
న్యూయార్క్: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాల్లో తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరం(టిడిఎఫ్) ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక టిడియఫ్ శాఖలు ఘనంగా నిర్వహించాయి.
ఈ ఉత్సవాల నిర్వహణ కోసం టిడిఫ్-యూఎస్ఏ కేంద్ర కమీటీ ప్రత్యేక శ్రద్ద తీసుకుని అమెరికాలో ఉండే ప్రతి తెలంగాణ ఏన్నారై కుటుంబాన్ని ఈ వేడుకల్లో భాగస్వాములను చేసింది. మే 30వ తేదిన పిట్స్‌బర్గ్ నగరంలో ఏన్నారైల తెలంగాణ అవిర్భావ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.
కనెక్టికట్, ప్లోరిడా, డల్లాస్, టెక్నాస్, వాషింగ్టన్ , న్యూయార్క్ నగారాల్లో వందల మంది ఏన్నారైలు ఈ వేడుకలకి భారీగా హజరయ్యారు. ముఖ్యంగా లాస్ఏంజిల్స్ సంబరాలు ఈ వారానికి హైలైట్‌గా నిలిచాయి. దాదాపుగా లాస్ ఏంజిల్స్ లోఉన్న ప్రతి తెలంగాణ ఏన్నారై కుటుంబం ఈ వేడుకలకు హజరయ్యింది.
సూమారు 500మంది ప్రవాసులు హజరైన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కలవా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏన్నో ఉద్యమాలనంతరం సాధించుకున్న మాతృ రాష్ట్రాభివృద్ధికి ప్రవాస తెలంగాణీయులందరూ అదే ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని కోరారు.

వేడుకలు
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు.

వేడుకలు
అమెరికాలోని ప్రధాన నగరాల్లో తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరం(టిడిఎఫ్) ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక టిడియఫ్ శాఖలు ఘనంగా నిర్వహించాయి.

వేడుకలు
ఈ ఉత్సవాల నిర్వహణ కోసం టిడిఫ్-యూఎస్ఏ కేంద్ర కమీటీ ప్రత్యేక శ్రద్ద తీసుకుని అమెరికాలో ఉండే ప్రతి తెలంగాణ ఏన్నారై కుటుంబాన్ని ఈ వేడుకల్లో భాగస్వాములను చేసింది.

వేడుకలు
మే 30వ తేదిన పిట్స్‌బర్గ్ నగరంలో ఏన్నారైల తెలంగాణ అవిర్భావ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.

వేడుకలు
కనెక్టికట్, ప్లోరిడా, డల్లాస్, టెక్నాస్, వాషింగ్టన్ , న్యూయార్క్ నగారాల్లో వందల మంది ఏన్నారైలు ఈ వేడుకలకి భారీగా హజరయ్యారు. ముఖ్యంగా లాస్ఏంజిల్స్ సంబరాలు ఈ వారానికి హైలైట్‌గా నిలిచాయి.
ఏన్నో ఆశలతో సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఏన్నారై నడుంబిగించాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం పనిచేస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను ఈ దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో తెలంగాణ కళాకారుల సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంసృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ అభివృద్దికి ఏం చేయాలనే అంశంపై విసృతమైన చర్చను చేపట్టారు. సంబరాల్లో భాగంగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒకే వేదికపైకి తెలంగాణ ఏన్నారైలు రావడంతో పండగ వాతావరణాన్ని తలపించాయి.












Click it and Unblock the Notifications