తెలంగాణ విలీన దిన వేడుకలు

లండన్: ఎన్నారై టిఆర్ఎస్ విభాగం, తెలంగాణా ఎన్నారై ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఒకేసారి తూర్పు లండన్, పశ్చిమ లండన్‌లో ఘనంగా "తెలంగాణా విలీన దినోత్సవ వేడుకలు" జరిగాయు. తెలంగాణ ఎన్నారై ఫోరం ఈస్ట్ లండన్ ఇంచార్జ్ శివాజీ షిండే అధ్యక్షతన ఈస్ట్ లండన్‌లో, ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సంయుక్త కార్యదర్శి దుసరి అశోక్ గౌడ్ అధ్యక్షతన వెస్ట్ లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ముందుగా తెలంగాణా రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

తరువాత శివాజీ షిండే మాట్లాడుతూ - 1948 లో తెలంగాణా రాష్ట్రం భారతం దేశంలో విలీనమైందని, మళ్లీ 1956 లో ఆంధ్రాతో వీలినం చేయడంతో తెలంగాణా ప్రజలకు స్వాతంత్రం లేకుండా పోయిందని, నేటి వరకు స్వాతంత్రం రాలేదని కేవలం తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంతో మాత్రమె సాధ్యమని తెలిపారు.

London NRI forum

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ - ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ఎవరు ఆపలేరని, తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నాయకత్వంలో సాధించిన తెలంగాణాని వారి నాయకత్వంలోనే పునర్నిర్మించుకుంటామని, ఇప్పటికైనా సమైక్య ఆంద్ర ముసుగులో తెలంగాణా ప్రజలపైన దండ యాత్రలు మానుకొని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించి, ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందామనిఅన్నారు. అలాగే సీమంధ్ర పార్టీలని ఇప్పటికైనా వదిలి మన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరిస్తేనే మన కల నెరవేరుతుందని తెలిపారు. హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణా తప్ప వేరే దేనికి తెలంగాణా ప్రజలు ఒప్పుకోరని, దాన్ని సాదించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

తెలంగాణా ఎన్నారై ఫోరం ప్రతినిథి రంగుల సుధాకర్ మాట్లాడుతూ - తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 29 వ తేదిన "చలో హైదరాబాద్ " కి మద్దతుగా "చలో లండన్" కార్యక్రమం నిర్వహిస్తామని, తెలంగాణా బిల్లు అమ్మోదించి మన రాష్ట్రంలో మనం ఉండే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు.

వివిధ ప్రాంతం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్, తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిథులు, ఎడ్లబండి డాట్ కామ్ అధిపతి సుమన్ బాలమురి, ప్రసాద్ తోట, రంగు వెంకట్,మల్లేష్ యాదవ్ పప్పు, సతీష్ రెడ్డి గొట్టేముక్కల,వెంకట్ రెడ్డి, బీరం, చక్రి, నవీన్ రెడ్డి, చోటు జితేందర్, జితేందర్, ప్రతాప్ అడిచెర్ల, రమేష్ బుద్దవరపు, అశ్విన్ గార్లపాటి, రమాకాంత్ నామనరవి చంద్ర రావులపల్లి, సతీష్ జమ్ముల, ప్రదీప్ వేముల, రోహిత్ రేపాక, సాయికృష్ణ పత్తిరెడ్డి, కిరణ్ వేల్పూరి, రాజకుమార్ బొచ్చు, శ్రవణ్ కనుకుంట్ల, రవికాంత్ ముదపుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+