Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వద్దిపర్తి పద్మాకర్‌చే అద్వితీయంగా స్కాట్లాండ్‌లో ప్రప్రథమ తెలుగు అష్టావధానం

లండన్: ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (యూకే)లోని అచ్చం తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. మొట్టమొదటి అష్టావధానం ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌చే జులై 9న విజయ్ కుమార్ రాజు పర్రి ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందూ మందిర్ వేదికయ్యింది.

వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుంచి కూడా ఏడింబరో విచ్చేసి ఆసక్తిగా తిలకించారు. త్రిభాషా మహాసహస్రావధాని, అవధాన విశ్వగురుబ్రహ్మ, సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి, అతిథులుగా విచ్చేసిన స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేయగా, స్కాట్లాండ్‌కు చెందిన గాయకుడు కుమార్ అనీష్ కందాడ గణేశుని ప్రార్థనా గీతం ఆలపించ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

Telugu Ashtavadhanam held at edinburgh Hindu Mandir and Cultural Centre in Scotland, United Kingdom

ఈ కార్యక్రమానికి పృచ్ఛకులుగా తెలుగు భాషను అమితంగా ప్రేమించే వారు కావడం వలన భానుసప్తమీ పర్వదినాన 12 మంది దివ్యమైన సూర్యుల కాంతి పద్మాకరునిపై వెదజల్లినటు ప్రకాశిస్తూ దివ్యంగా సాగిందీ కార్యక్రమం. పల్లవి మంగళంపల్లి వారి తీయనైన గాత్రముతో పృచ్ఛకులను వేదికమీదకు ఆహ్వానించిన తీరు రసరమ్యము.

సమస్యాపూరణం - నాగ ప్రసాద్ మంగళంపల్లి - వీరు సంధించిన సమస్య చాలా అద్భుతం.
దత్తపది - రంజిత్ నాగుబండి - వీరు సంధించిన నాలుగు పదాలు చాలా రమణీయం.
వర్ణన - సాయికుమారి దొడ్డ - భారతీయుల గొప్పదనాన్ని వర్ణించమని వినూత్న తరహాలో అడిగినట్టి సందర్భం.
నిషిద్ధాక్షరి - శైలజ గంటి - పోటాపోటీగా సాగిన వీరి అక్షర నిషిద్ధం అమోఘం.
న్యస్తాక్షరి - హిమబిందు జయంతి - కీలకమైన స్థానాలలో అక్షరాలను ప్రతిపాదిస్తూ సాగిన క్లిష్టమైన ప్రక్రియ.
ఆశువు - అనంత రామానంద్ గార్లపాటి, మమత వుసికల - వీరి పద్య గద్య సందర్భ ప్రయోగం చాలా వినూత్నంగా చూపరులను ఆకట్టుకొంది.

పురాణ పఠనం - విజయ్ కుమార్ రాజు పర్రి, మిథిష్ వద్దిపర్తి, జైన్ కుమార్ పోలిశెట్టి - ముగ్గురూ ముగ్గురే.. పద్యగాన చాతుర్యమును మూడు విధముల ప్రయోగించడం అన్నది అమోఘం.
అప్రస్తుత ప్రసంగం - సత్యశ్యాం కుమార్ జయంతి, నిరంజన్ నూక- వీరి చురుక్కులు, చమక్కులు భలే గమ్మత్తుగా, సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టేలా, నవ్వులు పూయించేలా, ఆలోచింపజేసివిగాను వుండటం విశేషం.

అవధాని తమకున్న అపారమైన జ్ఞానాన్ని ఆపాదిస్తూ అన్ని అంశాలకు పద్యాలను అల్లిన తీరు పృచ్ఛకులకే కాక చూపరులకు కూడా మహదానందం కలిగిందనడంలో ఆశ్చర్యం లేదు. ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ కార్యక్రమమునకు విశ్రాంత అధ్యాపకులు డా. అయ్యగారి జగన్నాథ కామేశ్వర ప్రసాద్ అవధాని ధారణా శక్తిని కొనియాడుతూ.. పృచ్ఛకుల కార్యదక్షతను ప్రశంసిస్తూ విమర్శనాత్మక విశ్లేషణ చేశారు. ఈ కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్‌ని నిర్వాహకులు విజయ్, పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, కానుకలతో, పూలు పండ్లతో సత్కరించారు.

హిమాలయాల తపోఫలం సిద్ధించినటువంటి త్రిభాషా మహాసహస్రావధానులు, సత్య సాయి బాబా వారు, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు, విశ్వయోగి విశ్వంజీ, వాడే కర్ మహారాజు వంటి మహా పీఠాధిపతులచే అనేక సత్కారాలను పొందినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తామే స్వయంగా స్వహస్తాలతో ఈ 12 మంది పృచ్ఛకులను సత్కరించడం అష్టావధాన చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. మహా అవధానులు పృచ్ఛకులను సత్కరించడం అరుదైన విశేషం!

'న భూతో న భవిష్యతి' అనే విధముగా సాగిన ఈ కార్యక్రమానికి చివరగ నిర్వాహకులు విజయ్ అవధానికి, పృచ్ఛకులకు, సభికులకు, గౌరవాతిథులు స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ మైథిలికి, అక్షరశిల్పి విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఎజి యం అయ్యగారి కోదండ రావుకి, పృచ్ఛకులకు తోడ్పాటు నందించిన తల్లాప్రగడ రామచంద్ర రావుకి, హిందు మందిర్ యాజమాన్యం రాజశేఖర్ జాలా, వాలంటీర్లకు, నిర్వహణలో సహాయపడిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపగా.. వేడుకను మంగళహారతితో సోదరీమణులు శ్రీవిద్య కందాడ,రేఖ దుగ్యాల, రాజి చక్క చక్కగా ముగించారు.

ఈ కార్యక్రమానికి మొదటి నుంచీ చివరి వరకు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించారు రామచంద్ర దుగ్యాల, కృష్ణ జుట్టాడ,
అశ్విన్ బక్కచెన్నగారి, సంత ష్ శ్రీరామ, సంతోష్ తోట,
సూర్య కిరణ్, ప్రదీప్ కందాడ, రేవతి సదా, లక్ష్మణ్, వరలక్ష్మి, రమ్య,
శ్రీలక్ష్మి, స్వాతి నాగుబండి, శ్రీభార్గవి గునిశెట్టి. వాలంటీర్లుగా
కార్తీక్ బొర్ర, జాహ్నవి బొర్ర, శివ జ్యోతి సంగం, యూనిస్ బైగ్ షేక్, బెంజమిన్
అస్మిత కట్టా, హరిణి రెడ్డి మంద, సాయి సుచిత్ రెడ్డి వీరవెల్లి, రీషిక వీరవెల్లి,
సాయి కిరణ్, అక్షర షాహిరి, సాయికృష్ణ పారెకర్ సేవలందించారు.

అదేరోజు సాయంత్రం 'శ్రీ కృష్ణ లీలలు' అంశం మీద భక్తి ప్రవచనాలు కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది.
కార్యక్రమాలను క్రింది లంకెలలో వీక్షించండి.
అష్టావధానం: https://fb.watch/lGbwVREE9j
భక్తి ప్రవచనాలు: https://fb.watch/lGCnvIaqFg

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+